
కరీంనగర్ జిల్లాలో వంద మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని లోయర్ మానేరు డ్యాం దగ్గరకు గొర్రెలను మేత కోసం తీసుకెళ్లారు. మద్యాహ్న సమయంలో గొర్రెల కాపర్లు భోజనం చేస్తుండగా .. గొర్రెల మందపై కుక్కులు దాడి చేశాయి. తమను తాము రక్షించుకొనేందుకు డ్యామ్ వైపు పరుగులు తీశాయి. నీళ్లలోకి వెళ్లిన 100 గొర్రెలు మునిగి మృతి చెందాయి.