అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో కీలక మైలురాయి దాటింది. బుధవారం (జనవరి 29) ఉదయం6.24 గంటలకు షార్ నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్15 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లడంతో ఇస్రో వందో ప్రయోగం సక్సెస్ అయింది. ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. కీలక సక్సెస్తో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.
అంతరిక ప్రయోగాల్లో ఇస్రో సాధించిన వందో విజయాన్ని ప్రస్తావిస్తూ.. ఇస్రో చైర్మన్ నారాయణన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇస్రో చరిత్రలో వందవ మైలురాయిని చేరుకోవడం చాలా కీలకం అన్నారు. 1979 లో శ్రీహరికోట నుంచి ఎస్ఎల్వీ ఈ1 ద్వారా మొట్టమొదటి రాకెట్ ప్రయోగం చేపట్టాం.. ఇప్పటివరకు వంద ప్రయోగాల ద్వారా 548 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపామన్నారు.
ALSO READ : సెంచరి కొట్టిన ఇస్రో.. GSLV F-15 ప్రయోగం విజయవంతం
2025లో గగన్యాన్..చంద్రయాన్ 4, జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ తో పాటు మరో రెండు ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు చేపడతామన్నారు ఇస్రో కొత్త చైర్మన్ నారాయణన్. రాబోయే రోజుల్లో శుక్రగ్రహం పై పరిశోకధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పాటు శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు.