
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూ్స్ చెప్పింది. రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్‌ఏల నుంచి ఆప్షన్స్ తీసుకొని ఈ పోస్టులు భర్తీ చేయనుంది. త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వెల్లడించనుంది. ఇటీవల కేబినెట్ భేటీలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే..
గతంలో వీఆర్వోలుగా పనిచేసి ప్రస్తుతం పలు శాఖల్లో ఉన్న 6 వేల మందిని గ్రామపంచాయతీ పాలనా అధికారులగా నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అదనంగా మరో 4 వేల పోస్టులకు ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకోనుంది.
ALSO READ | ఎంట్రన్స్ లేకుండానే నాబార్డ్‌లో ఉద్యోగాలు.. సంవత్సరానికి రూ. 50-70 లక్షలు జీతం
ఉగాది తర్వాత50వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 58 వేల పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే..