మూడు డ్రగ్స్ కేసుల్లో 11 మంది అరెస్ట్

మూడు డ్రగ్స్ కేసుల్లో 11 మందిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. వీరి నుంచి 4 లక్షల 50 వేల విలువ చేసే డ్రగ్స్, ల్యాప్ టాప్ మొబైల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు CP CV ఆనంద్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేశామన్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఎక్కువ మంది సాప్ట్ వేర్ ఉద్యోగులే ఉన్నారన్నారు. డ్రగ్స్ ను నిర్మూలించాలన్న లక్ష్యంతోనే స్టూడెంట్స్ ను కూడా అరెస్ట్ చేస్తున్నామన్నారు CP CV ఆనంద్.

మరిన్ని వార్తల కోసం

 

ఉక్రెయిన్ లో చిక్కుకున్న కామారెడ్డి జిల్లా విద్యార్థులు

వార్‌పై రష్యాకు వ్యతిరేక తీర్మానం.. ఓటేయని భారత్