పాక్​లో 12 మంది టెర్రరిస్టులు మృతి .. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఘటన

పాక్​లో 12 మంది టెర్రరిస్టులు మృతి .. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఘటన
  • మరో 9 మంది పౌరులు దుర్మరణం

పెషావర్: పాక్ భద్రతా దళాలు జరిపిన డ్రోన్ దాడుల్లో 12 మంది టెర్రరిస్టులు మరణించారు. తొమ్మిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌‌లో ఈ ఘటన జరిగింది. మర్దాన్ జిల్లా కట్లాంగ్‌‌ లోని మారుమూల కొండ ప్రాంతంలో టెర్రరిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి భద్రతాబలగాలకు సమాచారం అందింది. ఈ రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సెక్యూరిటీ ఫోర్సెస్ డ్రోన్ దాడులు చేశాయి. ఈ ఆపరేషన్ లో 12 మంది టెర్రరిస్టులు చనిపోగా, 

తొమ్మిది మంది పౌరులు మృతి చెందారు. 

పౌరుల మరణంతో స్థానికుల ఆందోళన 

మరణించిన పౌరులంతా స్వాత్ జిల్లాకు చెందిన గొర్రెల కాపరులని తెలుస్తోంది. వారి మృతదేహాలను మోటారు మార్గంలో ఉంచి స్థానికులు ఆందోళన చేపట్టారని, రహదారిని దిగ్బంధించారని రెస్క్యూ 1122 ప్రతినిధి మహమ్మద్ అబ్బాస్ వివరించారు. చర్చల తర్వాత రహదారిని తిరిగి తెరిచారని వెల్లడించారు.