భారతీయ ప్రాంతీయ నృత్యాలకు ఉన్న ఆధరణ పెద్దదే. మధ్యప్రదేశ్లోని ఖజురాహోలో ఫిబ్రవరి 20న 50వ డ్యాన్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ డ్యాన్స్ ఫెస్టివల్ లో మంగళవారం (ఫిబ్రవరి 20)న ఓ అరుదైన రికార్డ్ సృష్టించారు. ఒకేసారి 1484 మంది కళాకారులు కలిసి 20 నిమిషాల పాటు కథక్ డ్యాన్స్ చేశారు. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కింది. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. వీరిలో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు.
1484 మంది కళాకారులు కలిసి ఒకేరకమైన దుస్తుల్లో దేవాలయ ప్రాంగణంలో కథక్ నృత్యాన్ని ప్రదర్శించారు. 'రాగ బసంత్' అనే పాటకు సుమారు 20 నిమిషాలు నృత్యం చేశారు. వారిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ఉన్నారు. వారితో పాటు విదేశీ కథక్ కళాకారులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో జబలపుర్కు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు. డ్యాన్సర్స్ వేరు వేరు ప్రాంతాలోని వారు కావున, వారంతా వర్చవల్ గా ప్రాక్టీస్ చేశారు. వీరిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అభినందించారు. ఖజురహోలో గిరిజన, జానపద కళల శిక్షణ కోసం దేశంలోనే తొలి గురుకులాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.