నిర్మల్ జిల్లా: సోన్ మండలం కడ్తాల్ లోని 15 మంది వీడీసీ సభ్యులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భూవివాదంలో 3 రోజుల క్రితం వడ్యాల పోశెట్టి అనే రైతుకు జరిమానా విధించగా రైతు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు ఇవాళ చనిపోవడం వారి అరెస్టుకు దారితీసింది.
భువిక్రయాన్ని రైతు రద్దు చేసుకోవడంతో వీడీసీ సభ్యులు పంచాయతీ చేసి నాలుగున్నర లక్షల జరిమానా విధించారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు 3 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స ఫలించక మంగళవారం రైతు మృతి చెందాడు.