పాలమూరు జిల్లాలో ఉత్సాహంగా ఓటర్ దినోత్సవ ర్యాలీలు

పాలమూరు జిల్లాలో ఉత్సాహంగా ఓటర్ దినోత్సవ ర్యాలీలు

వెలుగు, నెట్​వర్క్: 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో శనివారం ర్యాలీలు నిర్వహించారు. జిల్లా, మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. నారాయణపేటలో కలెక్టరేట్  నుంచి సత్య నారాయణ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్  సిక్తా పట్నాయక్  ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేయగా, ఆర్డీవో రాంచందర్ నాయక్   ప్రతిజ్ఞ చేయించారు. సీనియర్  ఓటర్లను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. మహబూబ్​నగర్​  కలెక్టరేట్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాస రచన, ఉపన్యాస  పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్  విజయేందిర బోయి సర్టిఫికెట్లు అందచేశారు. 

అనంతరం పట్టణంలోని స్టేడియం గ్రౌండ్  నుంచి అంబేద్కర్  చౌరస్తా మీదుగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. గద్వాలలో ఓటరు దినోత్సవ ర్యాలీని కలెక్టర్  సంతోష్  ప్రారంభించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. నాగర్ కర్నూల్  పట్టణంలో కలెక్టర్  బదావత్  సంతోష్  ర్యాలీని ప్రారంభించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్‌‌‌‌ లిస్ట్​లో నమోదు చేయించుకోవాలని సూచించారు. వనపర్తి కలెక్టరేట్​లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అడిషనల్​ కలెక్టర్​ సంచిత్​ గంగ్వార్​ సీనియర్, యువ, దివ్యాంగ, మహిళా, ట్రాన్స్ జెండర్  ఓటర్లను సన్మానించారు.