
బీర్కూర్, వెలుగు : ఉపాధి హామీ పథకంలో భాగంగా 2023–-24 ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులకు సంబంధించి 15వ విడత సామాజిక తనిఖీ ఇన్ హౌస్ ప్రజా వేదిక బీర్కూర్ రైతు వేదికలో శుక్రవారం నిర్వహించారు. గ్రామాల వారీగా సమాచారం చదివి వినిపించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ వామన్ రావు వచ్చిన అభియోగాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ ప్రజావేదికలో జిల్లా విజిలెన్స్ అధికారి ప్రశాంత్ కుమార్, ఎంపీడీవో భాను ప్రకాశ్, ఎంపీవో మహబూబ్, ఏపీవో అక్మల్, ఎస్ఆర్పీ మహేశ్, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డు అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది, సామాజిక తనిఖీ బృందం సభ్యులు పాల్గొన్నారు.