తెలంగాణలో షాక్ : సెల్ ఫోన్ కొనివ్వలేదని 18 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య

జైపూర్: సెల్‌ ఫోన్‌ పగలగొట్టుకుందని తల్లిదండ్రులు మందలించడంతో పాటు, కొత్త ఫోన్‌ కొనివ్వడం లేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలోని వేలాల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన ప్యాగ స్వామి, సమ్మక్క దంపతుల కూతురు సాయి సుమ (18) మంచిర్యాలలో డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. 

సుమ ఫోన్‌ పగిలిపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. తర్వాత కొత్త ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతోంది. వారు  కొనివ్వకపోవడంతో గురువారం ఉదయం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. మధ్యాహ్నం టైంలో సుమ తమ్ముడు ఇంటికి వచ్చి ఎంత సేపు డోర్‌ కొట్టినా తీయకపోవడంతో  కిటికీ లోంచి చూడగా సుమ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూసే సరికే సుమ చనిపోయింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు చెప్పారు.