రూ. 4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మూడేండ్లలో 40 లక్షలు.. 200 మంది నుంచి రూ.2 కోట్లు వసూలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ స్కీమ్స్‌‌‌‌‌‌‌‌తో మోసాలకు పాల్పడుతున్న యూపీకి చెందిన మోస్ట్‌‌‌‌‌‌‌‌ వాంటెడ్‌‌‌‌‌‌‌‌ బాబీ చౌదరి అలియాస్‌‌‌‌‌‌‌‌ ఇజాజ్ అహ్మద్‌‌‌‌‌‌‌‌ను సిటీ సెంట్రల్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ‘మేజోన్ ఈ –మార్ట్‌‌‌‌‌‌‌‌’ స్కీమ్స్‌‌‌‌‌‌‌‌ పేరుతో చీటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కేసు వివరాలను సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన బాబీ చౌదరి(36) ‘మేజోన్ ఈ – మార్ట్ పేరుతో అదే ప్రాంతంలో ఆఫీసు ఓపెన్ చేశాడు. ఢిల్లీలోని కేపీ టవర్స్, మీరట్, జైపూర్, ముజఫరాబాద్, హైదరాబాద్​లోనూ బ్రాంచ్​లు తెరిచాడు. వివిధ రకాల ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ స్కీమ్స్ నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేశాడు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సెమినార్స్‌‌‌‌‌‌‌‌..

గతేడాది మార్చి నెలలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సెమినార్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించాడు. సూపర్ మార్కెట్‌‌‌‌‌‌‌‌, ఐడీ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తే తక్కువ టైమ్​లో ఎక్కువ డబ్బు వస్తుందని నమ్మించాడు. సూపర్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే 4 శాతం కమీషన్ చొప్పున 40 నెలల పాటు ప్రతి నెల రూ.1.2 లక్షలు లాభాలు ఇస్తామని చెప్పాడు. ఐడీ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో రూ.12 వేలు పెట్టుబడి పెడితే 38 నెలల పాటు ప్రతి నెల రూ. వెయ్యి ఇస్తామన్నాడు. దీంతో పాటు సూపర్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ కొనుగోళ్లలో 35 శాతం డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌ వస్తుందని నమ్మించాడు. ఇలా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన 200 మంది బాధితుల వద్ద రూ.2  కోట్లు వసూలు చేశాడు. సిటీకి చెందిన బాధితుడు రిజ్వాన్ కంప్లయింట్​తో  సీసీఎస్ పోలీసులు కేసు ఫైల్ చేసి బాబీ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు.

పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ హెర్బల్ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో మరో మోసం..

పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ హెర్బల్‌‌‌‌‌‌‌‌ కేర్ పేరుతో మల్టీలెవల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఢిల్లీకి చెందిన రియాజుద్దీన్‌‌‌‌‌‌‌‌, షకీల, పూజకుమారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐడీ స్కీమ్‌‌‌‌‌‌‌‌, పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ హెర్బల్‌‌‌‌‌‌‌‌ స్టోర్, పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌ల పేరుతో ఈ గ్యాంగ్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులు బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌లోని కేఎల్‌‌‌‌‌‌‌‌కే బిల్డింగ్​లో బ్రాంచ్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్ చేసి గతేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో కాటేదాన్‌‌‌‌‌‌‌‌, శాలిబండ, దారుసలామ్, మల్కాజిగిరి, సీతాఫల్‌‌‌‌‌‌‌‌మండిలో సెమినార్స్ నిర్వహించారు.  ఐడీ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 36 నెలల పాటు ప్రతి నెల రూ.880 చెల్లిస్తామని చెప్పారు. పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ హెర్బల్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 30 నెలల పాటు ప్రతి నెల రూ.30 వేలు, పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.25 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల  రూ.లక్ష చొప్పున 36 నెలలు ఇస్తామని నమ్మించారు. వీటితో పాటు రివార్డ్స్‌‌‌‌‌‌‌‌, టూర్స్, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్స్, బైక్స్, గోల్డ్‌‌‌‌‌‌‌‌ జువెలరీ, కార్లు, ఫ్లాట్స్‌‌‌‌‌‌‌‌ గిఫ్ట్స్‌‌‌‌‌‌‌‌గా ఇస్తామని ఆశ చూపారు. ఇలా దాదాపు 7 వేల మంది వద్ద రూ.200 కోట్లు వసూలు చేశారు. బాధితుల కంప్లయింట్ తో కేసు ఫైల్ చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.