'మా' అధ్యక్షుడు మంచు విష్ణు యూట్యూబ్ ఛానళ్లపై రద్దు చేయించడంపై కొందరు తప్పుడ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై ఆయన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ స్పందిస్తూ అసలు విషయం ట్విట్టర్ X ద్వారా వెల్లడించింది. అలాగే వారిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. వివరాల్లోకి వెళితే..
సినిమా నటీనటుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బందికరమైన కంటెంట్తో ట్రోల్ చేస్తే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ ని నిర్మూలించే ప్రయత్నం చేస్తామని ఇటీవలే మా హెచ్చరించింది. ఆ మేరకు 30 కి పైగా యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించింది.
అయితే, తాజాగా ఈ-మెయిళ్ల రచ్చ మొదలైంది. మంచు ఫ్యామిలీకి చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పేరుతో కొందరికి మెయిల్స్ వెళ్లాయని.. అందుకు సంబంధించిన స్కీన్‍షాట్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇవి తీవ్రం కావటంతో మంచు విష్ణు టీమ్ అధికారికంగా స్పందించింది.
24 ఎఫ్ ఎఫ్ అఫీషియల్ ('TwentyFour FFOfficial') అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. మంచు విష్ణు తాజా చిత్రం కన్నప్ప కంటెంట్ గురించి పాజిటివ్ వీడియోస్ చేస్తే..ఆ యూట్యూబ్ ఛానల్ మీద వేసిన స్ట్రైక్ వెంటనే తీసేస్తామని తమతో బేరానికి దిగినట్లుగా అసత్య ప్రచారానికి తెర లేపాడు. అంతేకాకుండా ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయితే దీనిపై మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారికంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంది.
తమ పేరుతో ఫేక్ ఈ-మెయిల్స్ పంపుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలనేలా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేస్తామని విష్ణు టీమ్ ప్రకటించినట్టు సమాచారం. "24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిళ్లు చక్కర్లు కొడుతున్నాయి. మేం ఆ ఈ-మెయిళ్లను పంపలేదు. వాటిని ఎవరూ పట్టించుకోవద్దని..ఆ సమాచారాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దని కోరుతున్నాం. మా అధికారిక ఈ-మెయిల్ ID నుండినుండి మెయిల్స్ వచ్చినా నమ్మొద్దు..ఫేక్ ఈ-మెయిల్స్ పంపుతున్న వాళ్లను త్వరలో గుర్తిస్తామని" స్ప్రష్టం చేసింది.
Official Statement from 24 Frames Factory pic.twitter.com/cO0AQIJsVP
— 24 Frames Factory (@24FramesFactory) July 26, 2024
ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో శివుడి భక్తుడు కన్నప్ప పాత్రను ఆయన పోషిస్తున్నారు. ఈ మూవీలో పలు భాషల ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.