![ముగిసిన ట్రైనీ ఆఫీసర్ల స్టడీ టూర్](https://static.v6velugu.com/uploads/2025/02/30-trainee-officers-study-tour-ends-on-saturday_v9NRhEaqGb.jpg)
నిజామాబాద్, వెలుగు: సెంట్రల్ మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌కు సెలెక్టయిన 30 మంది ట్రైనీ యువ ఆఫీసర్ల వారం రోజుల స్టడీ టూర్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్‌తో సమావేశమైన ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్‌లో గమనించిన అంశాలను ఆయనతో పంచుకున్నారు. డ్వాక్రా సంఘాల మహిళల్లో చైతన్యం స్ఫూర్తి నింపిందన్నారు. గ్రామీణ నేపథ్యంగల మహిళలు ఆర్థిక అంశాలలో కనబరుస్తున్న ప్రతిభ అద్భుతంగా ఉందన్నారు.
స్కూల్స్‌లో ఎండీఎం, అంగన్వాడీ, ఆశా వర్కర్లు పల్లె ప్రజలకు అందిస్తున్న సేవలు విలువైనవిగా గుర్తించామన్నారు. ఉపాధి హామీ పనులు, వ్యవసాయ కూలీల జీవన విధానాన్ని కూడా అధ్యయనం చేశామన్నారు. స్టడీ టూర్ మంచి అనుభూతిని కలిగించిందన్నారు. వీడ్కోలు చెప్పి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్‌కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.