డిస్కౌంట్.. బంపరాఫర్.. ఆలస్యం చేసిన ఆశాబంగం.. వెంటనే ఆఫర్ లో మీ చలానా కట్టేయండి.. రిలాక్స్ అవ్వండి.. ఇదీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్.. వెయ్యి రూపాయల చలానా 400 రూపాయలు కడితే సరిపోతుంది.. ఈ లెక్కన చాలా మంది వాహనదారులు తమ పేర్లతో ఉన్న చలాన్లకు కట్టేశారు.. రిలాక్స్ అయ్యారు.. ఇక్కడే ఓ ట్విస్ట్.. అదేంటంటే..
పెండింగ్ చలాన్లలో రెగ్యులర్ గా వాహనాల్లో తిరుగుతున్న వారు.. వాహనాలను ఉపయోగిస్తున్న వారు చలాన్లు కడుతున్నారు.. అయినా లక్షల సంఖ్యలో పెండింగ్ ఉంటున్నాయి.. ఇవన్నీ పదేళ్లు.. అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా ఉన్నాయి.. వీటి వల్లే అసలు సమస్య వస్తుంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు.. పదేళ్లుగా పెండింగ్ చలానా ఉన్న వాహనాల్లో చాలా వరకు వినియోగంలో లేవని.. స్క్రాప్ కిందుకు వెళ్లి ఉంటాయని.. అలాంటి వాహనాలను ఆయా కస్టమర్లు ఉపయోగించటం లేదనే విషయానికి వచ్చారు.. అలాంటప్పుడు ఆయా చలాన్లను పెండింగ్ కింద చూపించటం వల్ల ఉపయోగం లేదని.. దీని వల్ల ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ పై భారం పడుతుందని భావిస్తున్నారు...
ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఎప్పటికప్పుడు జరిమానాలు విధిస్తూ.. డిస్కౌంట్ లు ప్రకటిస్తున్నప్పటికీ కొన్ని చలాన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఒక్క రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పరిధిలో గత13 ఏళ్లుగా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లోనే ఉన్నాయి. 2010 నుంచి 2024 జనవరి 17 వరకు రాచకొండలో 32.69 లక్షల ట్రాఫిక్ చలానాలు, రూ.114 కోట్లు జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయి.. ఇలా కొన్నేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న చలాన్లను డేటా నుంచి తొలగించేలా లేదా రద్దు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఒకవేళ పోలీసులు దీనిపై అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దాదాపుగా 10 నుంచి 15 ఏళ్లుగా చలాన్ల పెండింగ్ లో ఉన్న వాహనాలకు బిగ్ రిలీఫ్ లభించినట్లు అవుతుంది.