40 లక్షల బ్యాక్​లాగ్​లు పోస్టులను భర్తీ చేయాలి

40 లక్షల బ్యాక్​లాగ్​లు పోస్టులను భర్తీ చేయాలి
  • కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంఘాల సమాఖ్య డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు:  కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 40 లక్షల బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేసి, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది. సమాఖ్య తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కె. మహేశ్వర్ రాజ్ ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తూ సోమవారం ఒక లేఖ రాశారు.

ముందుగా దేశవ్యాప్తంగా అన్ని కులాలు, మతాలవారీగా జనాభా లెక్కింపు చేపట్టాలని, ఆ వెంటనే రిజర్వేషన్లను పెంచి బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని 40 లక్షల బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేస్తే.. దేశంలోని ప్రతి గ్రామానికీ 6 చొప్పున మొత్తం 6,64,369 గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అలాగే తెలంగాణలోని 11,235 గ్రామాలకు 67,410 కేంద్ర ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య నివారణ కోసం వెంటనే ఈ బ్యాక్ లాగ్ లను భర్తీ చేయాలన్నారు.