- ప్రజావాణి అర్జీలు 46 శాతం పెండింగ్
- ఈ ఏడాదిలో పరిష్కారం కాని దరఖాస్తులు 1,520
కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణిలో బాధితులు ఇస్తున్న అర్జీలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. దరఖాస్తు తీసుకున్న తర్వాత గరిష్ఠంగా రెండు వారాల్లో పరిష్కరించాలనే కలెక్టర్ఆదేశాలను కింది స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారు. పరిష్కరించలేని అంశాలను లిఖితపూర్వకంగా తెలిపి క్లోజ్ చేయాలనే ఆర్డర్‌ను అశ్రద్ధ చేస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది ఇచ్చిన ప్రజావాణి విన్నపాలు 46 శాతం ఉన్నాయి. జనవరి నుంచి నవంబర్ వరకు 3,335 దరఖాస్తులు రాగా అందులో కేవలం 1,815 పరిష్కరించారు. ఇంకా 1,520 పెండింగ్‌లో ఉన్నాయి.
నిజామాబాద్, వెలుగు: సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు 46 శాతం పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కువగా ఇండ్లు, రేషన్‌కార్డ్, పింఛన్ల కోసం ఇచ్చే అర్జీలు ప్రభుత్వ అంశాలు కావడంతో వాటికి సమాధానాలు వెంటనే ఇచ్చేస్తున్నారు. ఉద్యోగాల కోసం వినతి పత్రాలు ఇచ్చినవారికి జాబ్ మేళాలు నిర్వహించినప్పుడు మేలు జరుగుతోంది. ఇలా 89 అప్లికేషన్లు ఈ ఏడాది పరిష్కారమయ్యాయి. అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తుల్లో జిల్లాలో 359, ఎంపీడీవోల పరిధిలో 274 అర్జీలు పెండింగ్ లో పెట్టారు. ఎన్పీడీసీఎల్ చూడాల్సిన 33 దరఖాస్తులపై దృష్టి సారించలేదు. జిల్లా కోఆపరేటివ్ఆఫీసర్కు బదిలీ చేసిన 25, పంచాయతీ ఆఫీసర్‌కు ట్రాన్స్‌ఫరైన 19, సోషల్ వెల్ఫేర్ శాఖ పరిధిలోని 20, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్‌కు చెందిన 11 సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.
జిల్లా రిజిస్ట్రార్‌కు పంపిన 16 అర్జీలలో ఒక్కటీ పరిష్కరించకపోగా అందుకు కారణాలు తెలిపే అవకాశమున్నా పట్టించుకోవడవంలేదు. సర్వే డిపార్ట్మెంట్కు వెళ్లిన వాటిలో సర్వేయర్ల కొరత చూపుతూ 41 అర్జీలను పక్కనపడేశారు. కలెక్టరేట్పరిధిలోని155 అర్జీలను పట్టించుకోకపోవడంపై దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌లో నెలకొన్న పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ సబ్ డివిజన్ఆఫీసులకు వెళ్లిన 65 వినతులకు సమాధానం లేదు. డీఈవో, ఐసీడీఎస్, డీఆర్డీవో, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, సివిల్ సప్లయి అంశాలపై త్వరగా స్పందింస్తున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్కు రైతులు ఇచ్చిన వాటిలో 43 పిటిషన్లు అపరిష్కృతంగా ఉన్నాయి.
కోఆర్డినేషన్ అవసరం
శాఖల సమన్వయ లోపంతో ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడంలేదని ప్రజలు భావిస్తున్నారు. లోక్‌సభ ఎలక్షన్ కోడ్ అమలలో ఉన్నప్పుడు భారీ వర్షాలు, వీఐపీ విజిట్స్ మినహా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తారు. మండల స్థాయి ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని తమ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు ఇస్తారు. కలెక్టర్ నేరుగా తీసుకోవడంతో పరిష్కారంపై భరోసాగా ఉంటారు. వారిచ్చిన అర్జీలను సంబంధిత శాఖల ఆఫీసర్లకు పంపి పరిష్కారమైతే ఆ వివరాలను స్పెషల్‌గా రికార్డులో నమోదు చేయాలి.
ALSO READ : కేసీఆర్‌కు మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
పరిష్కరించలేని కారణాలుంటే ఇన్రిటన్గా తెలిపే స్వతంత్రం ఉంది. ఉన్నత స్థాయిలో తీసుకునే అర్జీలు కావడంతో వాటి పరిష్కారంపై అపోహలు పెరగకుండా చూడాల్సిన అవసరం అన్ని శాఖల ఆఫీసర్లుపై ఉంది. కానీ జిల్లాలో అలా జరుగడంలేదు. కింది స్థాయి సబార్డినేట్స్‌కు అర్జీలను ట్రాన్స్ఫర్ చేయడంతో జిల్లా ఆఫీసర్లు బాధ్యత ముగించుకుంటున్నారు. అలా వచ్చిన గ్రీవెన్స్‌లను మండల ఆఫీసర్లు అశ్రద్ధ చేస్తున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తే సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.