ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన బస్సు.. ఐదుగురు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన బస్సు.. ఐదుగురు దుర్మరణం

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి బస్సు ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 40 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్లే ఒడిశాలోని పూరీ నుంచి కోల్‌కత్తాకు వెళ్తున్న ఓ బస్సు నేషనల్ హైవే -16 పై ఉన్న బారబతి బ్రిడ్జిపై  నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

 ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం  కటక్ ఎస్ సీబీ మెడికల్ కాలేజ్ కు  తరలించినట్లు ధర్మశాల పోలీసు స్టేషన్ ఇన్ చార్జి తపన్ కుమార్ నాయక్ తెలిపారు. 

రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ప్రమాదంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు.  మృతులకు రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.