అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఈ భూకంపం తర్వాత యూఎస్ (US)... సునామీ హెచ్చరిక వ్యవస్థ సునామీ ముప్పును జారీ చేసింది. ఈ రోజు సంభవించిన భూకంపం 9.3 కి.మీ (5.78 మైళ్లు) లోతులో వచ్చినట్టు యూఎస్‌జీఎస్ తెలిపింది.
అలాస్కా ద్వీపకల్పం, అలూటియన్ దీవులు, కుక్ ఇన్‌లెట్ ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయని అలస్కా భూకంప కేంద్రం తెలిపింది. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా నష్టం గురించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు.
అలాస్కాలో 1964 మార్చిలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపం. అప్పట్లో వచ్చిన సునామీ అలస్కా గల్ఫ్, US పశ్చిమ తీరం, హవాయి ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. భూకంపం, సునామీ కారణంగా 250 మందికి పైగా మరణించారు.
Notable quake, preliminary info: M 7.4 - 106 km S of Sand Point, Alaska https://t.co/ftepDWDKb7
— USGS Earthquakes (@USGS_Quakes) July 16, 2023