8 సంవత్సరాల బ్యాటరీ వారంటీతో.. MX moto సంస్థ e-బైక్ లాంచ్

8 సంవత్సరాల బ్యాటరీ వారంటీతో.. MX moto సంస్థ e-బైక్ లాంచ్

MXmoto M16:భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తో పాటు కొత్త మోడళ్ల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ MXmoto  తన లాంగ్ రేంజ్ క్రూయిజర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ MXmoto M16  ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఈ బైక్ సరికొత్త హైక్వాలిటీ ఎలక్ట్రిక్ బైక్ అని, ఇది ఇండియా రోడ్లపై అద్బుతమైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ చెపుతోంది. 

M16 e-బైక్ బ్యాటరీపై 8 సంవత్సరాల వారంటీని ఇస్తోంది. ఇది కాకుండా మోటారు పై 80వేల వారంటీ , కంట్రోలర్ పై 3 సంవత్సరాల వారంటి అందిస్తుంది. దీని మెటల్ బాడీ.. ఈ బైక్ ను బలమైన EV గా నిలబెడుతుంది. ఆకర్షణీయమైన లుక్, పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తున్న ఈ e-బైక్ ప్రారంభ ధర రూ. 1లక్షా 98 వేలు( ఎక్స్ షోరూమ్ ధర ) నిర్ణయించబడింది. 

లాంగ్ రేంజ్ 220 కి.మీలు..

ఈ బైక్ ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే 160-220 కి.మీల దూరం ప్రయాణించగలదు. వినియోగదారు ప్రతి ఛార్జ్ పై 1.6 యూనిట్ల విద్యుత్ ను వినియోగిస్తారు.3 గంటల లోపు 0నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో4వేల వాట్ల BVDC హబ్ మోటార్ ఉంటుంది. ఇది 140Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 

క్రయూజర్ డిజైన్, ఫీచర్లు అద్భుతం ..

MXmoto M16 క్రూయిజర్లో పెద్ద 17 అంగుళాల అల్లాయ్ వీల్స్తో వస్తోంది. ఇవి అన్ని రకాల రోడ్లపై మంచి పనితీరును అందిస్తాయి. వీటిలోపాటు రేసింగ్ మోటార్ సైకిల్ రకం సెంట్రల్ షాక్ అబ్జర్వర్ లను కలిగి ఉంటుంది. ఈ బైక్ ట్రిపుల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ తోపాటు LED డైరెక్టర్ ఇండికేటర్ లతో వస్తుంది. అల్ట్రా సోనిక్ కంటిన్యూస్ వెల్డింగ్ టెక్నాలజీతో వస్తుంది.

ఈబైక్ ప్రత్యేక లక్షణాలలో క్రూయిజ్ కంట్రోల్ రివర్స్ అసిస్ట్, యాంటీ స్పీడ్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్, ఆన్ బోర్డు నావిగేషన్, ఆన్ రైడ్ కాలింగ్, బ్లూటూల్ కనెక్టివిటీ , సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.