
గద్వాల, వెలుగు: గద్వాల వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ పై దాడి చేసి, ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీకి ఆటంకం కలిగించిన కేసులో 9 మందికి నెల రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.వెయ్యి జరిమానా విధిస్తూ మహబూబ్ నగర్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
2017 నవంబర్ 7న వేరుశనగ ధర విషయంలో ఆందోళనకు దిగిన రైతులు మార్కెట్ ఆఫీసు ఫర్నిచర్, అద్దాలు, డోర్లు, మైక్ సెట్, బీరువాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. మార్కెట్ కార్యదర్శి డ్యూటీకి అడ్డు తగిలారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో గోకారి, మహబూబ్, గుడిసె సవారన్న, కురువ భీముడు, మైబు, ఖాజా హుస్సేన్, నరేశ్, గోవిందు, వెంకటేశ్‌కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.