IND Vs NZ, 1st Test: అరుదైన ఘనత.. టెస్టుల్లో 9 వేల పరుగుల క్లబ్‌లో విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయి చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో 9 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టులో 42 ఓవర్లో విలియం ఒరోర్కే బౌలింగ్ లో సింగిల్ పూర్తి చేసి ఈ ఘనతను అందుకున్నాడు. టెస్టు క్రికెట్ లో భారత్ నుంచి 9 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో ప్లేయర్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్ గా అంతర్జాతీయ టెస్ట్ ల్లో 18 వ క్రికెటర్.    

కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (15921), రాహుల్ ద్రవిడ్(13265), సునీల్ గవాస్కర్ (10122) మాత్రమే 9 వేలకు పైగా పరుగులు చేశారు. 197 ఇన్నింగ్స్ ల్లో విరాట్ 9 వేల పరుగుల మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ పరంగా భారత ఆటగాళ్లలో ఇదే అత్యంత స్లోయస్ట్ . సచిన్ టెండూల్కర్,  రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ తక్కువ ఇన్నింగ్స్ లే అవసరమయ్యాయి. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి సూపర్ జోష్ లో ఉన్నాడు. 

ALSO READ | IND Vs NZ, 1st Test: జాగ్రత్తగా ఆడినా ఔట్: చేజేతులా వికెట్ పారేసుకున్న రోహిత్

సర్ఫరాజ్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్ ను ఆడుకుంటున్నాడు. ప్రస్తుతం మూడో రోజు చివరి సెషన్ లో 45 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. క్రీజ్ లో కోహ్లీ (68), సర్ఫరాజ్ (68) ఉన్నారు. భారత్ ఇంకా 129 పరుగులు వెనకపడి ఉంది. రోహిత్ శర్మ (52) అర్ధ సెంచరీతో రాణించాడు. జైశ్వాల్ 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.