బెంగళూరు రెవా యూనివర్శిటీలో ఘర్షణ... బీటెక్​ విద్యార్థి హత్య

ప్రతి చిన్న దానికి ఆవేశానికి లోను కావడం.. గొడవ పడటం.. ఇలాంటి ఘటనలు తరుచు వింటున్నాం. అది పెద్దలైనా.. వృద్దులైనా సరే ఏదో ఒక సమయంలో ఇతరులతో గొడవ పడుతుంటారు.  ఇక విద్యార్థులైతే చెప్పనక్కరలేదు. కళాశాలల్లో గ్రూపులుగా ఏర్పడి ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసుకున్న ఘటనలు జరుగుతున్నాయి. ఒక్కోసారి ఇవి హత్యలకు దారి తీసిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా బెంగళూరులో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది.

బెంగళూరులోని యెలహంక  సమీపంలోని కత్తిగెనహళ్లిలోని కళాశాలలో  శుక్రవారం (ఏప్రిల్​ 28)  రాత్రి  కాలేజీ ఫెస్ట్​ జరిగింది.  రెవా యూనివర్సిటీ కాలేజీ ఫెస్ట్‌లో ఇరు  వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది.  మాటా మాటా పెరగడంతో కత్తి పోట్లకు దారితీసింది.  ఈ ఘటనలో 22 ఏళ్ల విద్యార్థి భాస్కర్ జెట్టి  కత్తిపోట్లకు గురయి మృతి చెందాడు.  మృతుడు  మెకానికల్ ఇంజినీరింగ్ ఫైనల్​ ఇయర్ చదువుతున్నాడు. సమాచారం అందుకున్న డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) లక్ష్మీ ప్రసాద్  "బాగలూరు పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీస్​ అధికారి లక్ష్మీ ప్రసాద్​ తెలిపారు. 

ఏదైనా గొడవ జరిగినప్పడు ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలాంటి ఘటనలు జరగవు.  తాము పడిన కష్టాలు పిల్లలు పడకూడదని.. తల్లి దండ్రలు కళాశాలలకు పంపిస్తారు.  ప్రస్తుతం వారు చేయాల్సిన దానిని విస్మరించి.. ఇతర విషయాలపై దృష్టి పెడితే.. తోటి విద్యార్థులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది.  ఇవి ఒక్కోసారి మితిమీరి అనుకోని సంఘటనకు దారితీస్తాయి.  సో బీకేర్​ ఫుల్​ స్టూడెంట్స్​. . . .