అవాక్కయ్యారా : బాల్కనీనే ఇల్లు.. అద్దె నెలకు 80 వేలు..

అవాక్కయ్యారా : బాల్కనీనే ఇల్లు.. అద్దె నెలకు 80 వేలు..

ఇల్లు అద్దెకు అంటే ఓ గది.. సింగిల్ బెడ్ రూం, డబుల్ బెడ్ రూం ఇలా ఉంటుంది.. ఇక హాస్టల్స్ అయినా సరే ఓ బెడ్ ఉంటుంది.. అది అయినా ఇంట్లోనే ఉంటుంది.. ఆస్ట్రేలియాలో మాత్రం అందుకు భిన్నం.. ఏకంగా ఇంటి బాల్కనీని అద్దెకు ఇచ్చారు.. బాల్కనీలోనే బెడ్.. ఇక బాత్రూం అంటారా కామన్ గా ఉండేది వాడుకోవాలి.. పడుకోవటం మాత్రం బాల్కనీలోనే.. ఆఫీసుకు సెలవులు అయితే బాల్కనీలోనే ఉండాలి.. 

బాల్కనీ కాబట్టి అద్దె ఏదో వెయ్యి.. రెండు వేలు అనుకునేరు.. సమస్యేలేదు.. బాల్కనీ అద్దె నెలకు అక్షరాల 80 వేల రూపాయలు.. ఏంటీ అవాక్కయ్యారా.. బాల్కనీ అద్దె 80 వేలు ఏంటీ అని.. అవును మరి అది ఆస్ట్రేలియాలో.. ప్రైమ్ లొకేషన్ ఏరియాలో..

ఆస్ట్రేలియాలోని హైమార్కెట్ ఏరియాలో ఓ వ్యక్తి సన్నీ రూం అంటూ సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశాడు. ఏంట్రా బాబు ఇది అని నెటిజన్స్ ఆరా తీయగా కళ్లు తిరిగే నిజాలు బయటపడ్డాయి. బాల్కానీకి అక్షరాల రూ. 80 వేలు.. సంవత్సారానికి అంత ఉంటుంది మరీ అనుకుంటున్నారా..కాదు కాదు.. ఓక వారానికి ఏంటి వారారానికి రూ. 80 వేల అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెట్టగా.. ఆస్ట్రేలియాలో అంతే ఆస్ట్రేలియాలో అంతే అని సినిమా డైలాగ్స్ తో మీమ్స్ షేర్ చేసుకుంటున్నారు.

 ఆస్ట్రేలియా సిడ్నీలోని వెస్ట్, సౌత్ సైడ్ లో రెంట్స్ రేట్లు 28 % నుంచి 31 %నికి పెంచారు. దీంతో అక్కడ చదువుకోవడానికి వెళ్లే విధ్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు.