బైక్​ హారన్ ​ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు.. మద్యం మత్తులో వ్యక్తిపై యువకుల దాడి

బైక్​ హారన్ ​ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు..  మద్యం మత్తులో వ్యక్తిపై యువకుల  దాడి

గచ్చిబౌలి, వెలుగు: బైక్​హారన్ ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించిన వ్యక్తిపై మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. రాయదుర్గం పోలీసుల వివరాల ప్రకారం.. మణికొండ పోచమ్మకాలనీకి చెందిన నాగార్జునరెడ్డి ఓ ప్రైవేట్​కోచింగ్​సెంటర్​లో పనిచేస్తున్నాడు. 

ఈ నెల 2న అర్ధరాత్రి తన ఇంటి ముందు సెల్​ఫోన్​మట్లాడుతుండగా, దాదాపు 9 మంది మూడు బైక్​లపై హారన్​కొట్టుకుంటూ వెళ్లారు. దీంతో హారన్​ఎందుకు కొడుతున్నారని నాగార్జున్​రెడ్డి వారిని ప్రశ్నించగా, అందరూ కలిసి అతడిపై దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవపడ్డ యువకులను అదే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించి అదుపులోకి 
తీసుకున్నారు.