హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ పెడ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా..గుట్టుచప్పడు కాకుండా డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ సిటీకి డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్థులు, సాఫ్ట్ వేర్లకు విక్రయిస్తున్నారు. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు.
హైదరాబాద్ సిటీలోని రాయదుర్గం పోలీస్ పరిధిలోని భారీగా డ్రగ్స్ పట్టుబంది. మాదాపూర్ జోన్ ఎస్ వోటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తగంగా చేప్టటిన ఆపరేషన్ లో 650 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు పెడ్లర్స్, ఐదుగురు వినియోగదారులను అరెస్ట్ చేశారు.నిందితులు రాజస్థాన్ కుచెందిన వారుగా గుర్తించారు.