జైల్ మండీ.. బకెట్ బిర్యానీ..

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‌లో నయా ఫుడ్​కల్చర్​స్టార్ట్​అయింది. సిటీకి బ్రాండెడ్‍ బిర్యానీ సెంటర్లు క్యూ కడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు బిర్యానీ అనగానే ఓ రెండో, మూడో హోటళ్ల పేర్లు వినబడేవి. ఇప్పుడు గల్లీకో రెస్టారెంట్‍ ఓపెన్‍ చేస్తున్నారు. భోజన ప్రియులను ఓవైపు టేస్టీ ఫుడ్‍తో తమ కస్టమర్లుగా చేసుకుంటూనే.. మార్కెట్​లో పోటీ తట్టుకోవడానికి సరికొత్త 'థీం'తో ముందుకు వస్తున్నాయి. సరికొత్త వంటకాలు, డిఫరెంట్​లుక్‍తో ట్రెండింగ్‍గా యూత్‍ను ఆకట్టుకుంటున్నాయి. గత రెండు, మూడు నెలల్లో గ్రేటర్‌‌లో బ్రాండెడ్‍ రెస్టారెంట్ల ఫ్రాంచైజీలు రాగా.. న్యూ ఇయర్‍ సందర్భంగా మరో పది రెస్టారెంట్లు కస్టమర్లకు వెల్‍కమ్‍ చెబుతున్నాయి.

బ్రాండెడ్‍ రెస్టారెంట్ల కన్ను  

వరంగల్‍ సిటీలో వందలాది స్కూళ్లు, యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, మెడికల్​కాలేజీలు, ట్రైనింగ్‍ ఇనిస్టిట్యూషన్లు, జాబ్‍ కోచింగ్‍ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడి స్టూడెంట్స్​పై దృష్టి పెట్టిన ఫేమస్‍ బిర్యానీ సెంటర్లు, రెస్టారెంట్లు వరంగల్‍లో తమ బ్రాంచీలను ఓపెన్​ చేస్తున్నాయి.  గ్రేటర్ పరిధిలో గతేడాది వరకు బిర్యానీ, బెస్ట్​ఫుడ్‍ అందించే హోటళ్లు, రెస్టారెంట్లు దాదాపు 20 వరకు ఉండగా.. ఈ ఒక్క ఏడాదిలోనే వివిధ కంపెనీలకు చెందిన మరో 20 ఫుడ్‍ కోర్ట్స్​ ఓపెన్​అయ్యాయి. క్రిస్‍మస్‍, న్యూ ఇయర్‍ను క్యాష్‍ చేసుకునేందుకు ఇంకో 10 రెస్టారెంట్లు ఓపెన్‍ అయ్యాయి. 

సౌదీ మండీ కల్చర్‍

హైదరాబాద్‍ తర్వాత బిర్యానీకి అడ్డాగా చెప్పుకునే వరంగల్‌లో ఇప్పుడు సౌదీ, అరబ్‍ దేశాల్లో మాదిరి 'మండి' బిర్యానీ కల్చర్‍ వచ్చింది.  టేబుళ్లు, కుర్చీలు లేకుండా ఐదారుగురు వ్యక్తులు కిందనే పరుపుల్లో కూర్చోని తినేలా ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. అందరికీ కలిపి ఒకే పెద్ద ప్లేట్‍లో చికెన్‍, మటన్‍ బిర్యానీ అందిస్తున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్​ అందరూ కలిసి ఒకే కంచంలో తింటున్నారు. 

ప్లాస్టిక్‍ బకెట్లలో బిర్యానీ పార్సిల్‍

ఇన్నాళ్లు ముంబై, బెంగళూర్‍, హైదరాబాద్‍ వంటి మెట్రో సిటీల్లో అందుబాటులో ఉన్న రెడ్‍ బకెట్‍, గ్రీన్‍ బకెట్‍, హాట్‍ బకెట్‍ వంటి ఫుడ్‍ రెస్టారెంట్ల ఫ్రాంచైజీలు ఇప్పుడు వరంగల్​లో అడుగుపెట్టాయి. పార్సిల్‍ సర్వీస్‍లు మాత్రమే అందజేస్తున్నాయి. ఇన్నాళ్లు సిల్వర్‍ కవర్లలో బిర్యానీ పార్సిల్‍ ఉండగా.. ఈ రెస్టారెంట్లలో రెడ్‍, గ్రీన్‍ ప్లాస్టిక్‍ బకెట్లలో బిర్యానీ ఇస్తున్నారు. ఇదో రకం ట్రెండింగ్‍ కావడంతో పబ్లిక్‍ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. పబ్లిక్‍ను ఆకట్టుకోవడానికి హోటళ్లు, రెస్టారెంట్లు ఢిఫరెంట్ లుక్‍తో వస్తున్నా.. కస్టమర్లు మాత్రం ఫైనల్‍గా రుచికరమైన బిర్యానీ, క్వాలిటీ ఫుడ్‍ ఐటెంలకే ప్రయారిటీ ఇస్తున్నారు. 

రైల్‍ రెస్టారెంట్‍.. జైల్‍ మండీ

వరంగల్‍ సిటీలో రెస్టారెంట్ల మధ్య కాంపిటీషన్‍ పెరగడంతో జనాలను ఆకర్షించేందుకు సరికొత్త థీంతో మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ ఐడియా నుంచి వచ్చినవే..  రైల్‍, జైల్‍ రెస్టారెంట్లు. కాజీపేట ఎన్‍ఐటీ ఏరియాలో రైల్‍ సెట్టింగ్‍తో రెస్టారెంట్‍ ఓపెన్‍ చేశారు. ట్రైయిన్‌లో కూర్చొని డిన్నర్‍ చేసినట్లు ఫీలయ్యాలే బోగీలను ఏర్పాటు చేశారు. కస్టమర్లు వెళ్లే గదులకు కొన్ని రైల్వే స్టేషన్ల పేర్లు, కూర్చునే టేబుళ్లకు ఫ్లాట్‍ఫాం నంబర్లు ఇచ్చారు. ట్రైయిన్‍ బొమ్మలతోనే సర్వీస్‍ అందేలా కిచెన్‍ నుంచి టేబుళ్ల వరకు ట్రాక్‍ వేశారు. కస్టమర్లు ఇచ్చిన ఫుడ్‍.. ట్రాక్‍ మీదుగా వచ్చేలా ఏర్పాటు చేయడంతో తినడానికి వచ్చేవారు థ్రిల్‍ ఫీలవుతున్నారు. కేయూ ఎస్డీఎల్సీఈ  జంక్షన్‍లో జైల్‍ థీంతో సెంట్రల్‍ జైల్‍ను తలపించేలా సెట్ వేశారు. పోలీస్‍ యూనిఫాంలో సిబ్బంది, రైఫిల్‍ బొమ్మలు ఏర్పాటు చేశారు.  కస్టమర్లు తినేందుకు కూర్చునే గదులను బ్యారక్‍లా మార్చారు. సర్వీస్‍ బాయ్స్​ ఖైదీ డ్రెస్సుల్లో వచ్చి సర్వ్​చేస్తున్నారు.