జిల్లాలు మారిన జీహెచ్ఎంలకు జీపీఎఫ్ కష్టాలు..ఏడాదిన్నర దాటినా జడ్పీ ఖాతాల్లోని అమౌంట్ బదిలీ కాలే

జిల్లాలు మారిన జీహెచ్ఎంలకు జీపీఎఫ్ కష్టాలు..ఏడాదిన్నర దాటినా జడ్పీ ఖాతాల్లోని అమౌంట్ బదిలీ కాలే
  • కొన్ని జిల్లాల్లో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ నంబర్ ఇవ్వట్లే
  • అధికారుల నిర్లక్ష్యంతో మైసన్​లో హెడ్మాస్టర్ల అకౌంట్లు
  • ఏడాదిన్నర నుంచి సమస్య పరిష్కరించని అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గెజిటెడ్ హెడ్మాస్టర్లకు కొత్త సమస్య మొదలైంది. వాళ్ల జీతంలో నుంచి కొం త దాచుకున్న డబ్బులు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు రావడమే. వారితో పాటు వారి జీపీఎఫ్ ఖాతాల్లోని మొత్తం కూడా కొత్త జిల్లాకు రావాల్సి ఉం డగా, ఇప్పటికీ పలు జిల్లాల్లో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల సమన్వయ లోపంతో హెడ్మాస్టర్లకు ఏడాదిన్నర నుంచి తిప్పలు తప్పడం లేదు.

రాష్ట్రంలో 2023, సెప్టెంబర్ లో ప్రభు త్వం హెడ్మాస్టర్లకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ నిర్వ హించింది. మల్టీ జోనల్ పోస్టులుగా హెడ్మాస్టర్లు మార డంతో.. చాలామంది పనిచేస్తున్న జిల్లా నుంచి మరో జిల్లాకు మారాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతమున్న జడ్పీ జీపీఎఫ్ ఖాతాల స్థానంలో ఏజీ జీపీఎఫ్ నంబర్ల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. చాలామందికి నంబర్లు కూడా అలాట్ అయ్యాయి. అయితే,  పంచాయతీరాజ్ పరిధిలో పనిచేస్తున్న టీచర్లకు ఏజీ జీపీఎఫ్ నిబంధనలకు విరుద్ధమని గవర్నమెంట్ టీచ ర్లు కొందరు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది.

దీంతో చేసేదేమీ లేక జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే హెడ్మాస్టర్లు.. జెడ్పీ అధికారులకు కొత్త సబ్ స్క్రిప్షన్ కోసం అప్లై చేసుకున్నారు. చాలా జిల్లాల్లో జడ్పీ జీపీఎఫ్ నిధులు బదిలీ కాలేదు. కొన్ని జిల్లాల్లో పాత అమౌంట్​తో సంబంధం లేకుండా కొత్తగా జీరో బ్యాలెన్స్ ఇస్తామంటూ అధికారులు తెలపడంతో హెడ్మా స్టర్లలో ఆందోళన మొదలైంది. పాత జిల్లాలు, కొత్త జిల్లాల చుట్టూ తిరగలేక అయోమయంలో ఉన్నారు.

ఆ నిధులెక్కడ.?  

ప్రతి టీచర్, హెడ్మాస్టర్ బేసిక్ పే నుంచి 6 శాతం కట్ అయి జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. డీఏలు, ఇతర ఏరియర్స్ కూడా అదే ఖాతాల్లో పడ్తాయి. చాలా జిల్లాల్లో ఖాతా నంబర్లు ఇవ్వడం లేదు. దీనికితోడు జీరో అమౌంట్​తో ఇస్తామనడంతో కొందరు ఖాతా నంబర్లు తీసుకోవడం లేదు. దీంతో కొన్నేండ్ల నుంచి జమ అయి న నిధులు ఎక్కడున్నాయనే అనుమానం వ్యక్తమవుతున్నది. ఆన్​లైన్ స్లిపుల్లో మాత్రం లక్షలు ఉన్నట్టు చూపిస్తు న్నా.. ఖాతాలు మాత్రం మైనస్​లు చూపిస్తున్నాయి.

కొందరికి కొంత మొత్తం జమ చేసి, ఇంకొంత ఆపేశారు. మూడేండ్ల నుంచి వడ్డీ కూడా యాడ్ కావడం లేదని హెడ్మాస్టర్లు చెప్తున్నారు. ఈ సమస్యతో లోన్ తీసుకోవాలన్నా, ఫార్ట్ ఫైనల్ కింద డ్రా చేసుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిధులు లేకపోవడంతో డబ్బులు ఇవ్వలేమని వారు చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ స్పందించి జీపీఎఫ్ ఖాతాల సమస్యను పరిష్కరించాలని జిల్లాలు మారిన హెడ్మాస్టర్లు కోరుతున్నారు.

ఏజీజీపీఎఫ్ నంబర్లు ఇవ్వాలి

బదిలీల ద్వారా జిల్లాలు మారిన హెడ్మాస్టర్లకు జీపీఎఫ్​ ఖాతాల సమస్య తీవ్రంగా ఉంది. దాచుకున్న డబ్బులు అకౌంట్లో లేవు. ఖాతాలు మైనస్​లో చూపిస్తున్నాయి. పాత జిల్లాల నుంచి జీపీ ఎఫ్ అమౌంట్ బదిలీ కాలేదని.. కొత్త జిల్లాల జెడ్పీ అధికారులు చెప్తున్నారు. ఉన్న జీపీఎఫ్ అమౌంట్ ఉపయోగం లేకుండా పోతున్నది. ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి అందరికీ ఏజీ జీపీఎఫ్ నంబర్లు ఇవ్వాలి. జడ్పీ జీపీఎఫ్ ఖాతాల నిధులు వెంటనే కొత్త జిల్లాలకు బదిలీ చేయాలి.- రాజ్ గంగారెడ్డి, జీహెచ్​ఎంఏ స్టేట్ ప్రెసిడెంట్