మియాపూర్ లో దారుణం.. అపార్ట్ మెంట్ పై నుంచి దూకి యువతి సూసైడ్

మియాపూర్ లో దారుణం.. అపార్ట్ మెంట్ పై నుంచి దూకి యువతి సూసైడ్

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మియాపూర్ జనప్రియ అపార్ట్ మెంట్ పై నుండి ఓ యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే  జనప్రియ అపార్ట్ మెంట్ లో నివసాం ఉంటున్న 25 ఏళ్ల శృతి పై అంతస్తు నుంచి కిందకు దూకింది. దీంతో తీవ్ర రక్త స్రవంతో యువతి కొట్టిమిట్టాడింది. స్థానికులు యువతిని గమనించి ఆస్పత్రికి తరలించారు. 

ఆస్పత్రి తీసుకెళ్లే క్రమంలోనే శృతి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు యువతి డెడ్ డెత్ పై కేసు నమోదు చేసుకున్నారు. డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.