Yuzvendra Chahal: కారణం లేకుండా చాహల్ కెరీర్‌ను నాశనం చేశారు: బీసీసీపై మాజీ క్రికెటర్ ఫైర్

Yuzvendra Chahal: కారణం లేకుండా చాహల్ కెరీర్‌ను నాశనం చేశారు: బీసీసీపై మాజీ క్రికెటర్ ఫైర్

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రెండేళ్లుగా భారత వన్డే జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. ఫామ్ లో ఉన్నప్పటికీ  టీమిండియాలో చాహల్ కు చోటు దక్కకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించేదే. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ తో పాటు వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి చాహల్ కు చోటు దక్కలేదు. చాహల్ కెరీర్ ముగిసిపోవడానికి బీసీసీఐ కారణమని టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుతం కామెంటేటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 

బీసీసీఐ,టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా చాహల్ కెరీర్‌ను ముగించిందని చోప్రా ఆరోపించాడు. రెండేళ్ల క్రితం వన్డేలకు దూరంగా ఉన్నప్పుడు చాహల్ గణాంకాలు బాగున్నాయని వాదించాడు. చోప్రా మాట్లాడుతూ.. "యుజ్వేంద్ర చాహల్ కెరీర్  పూర్తిగా ముగిసిపోయింది. అతనికి భారత జట్టులో దారులు మూసుకుపోయాయి. బీసీసీఐ,టీమ్ మేనేజ్‌మెంట్ ఇలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. చాహల్ చివరిసారిగా 2023లో వన్దే ఆడాడు. అతని వన్డే గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. చాలా వికెట్లు తీయడంతో పాటు నిలకడగా రాణించాడు". అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పాడు. 

Also Read :- తొలి టీ20 ముందు ఊరిస్తున్న రెండు రికార్డులు

ప్రస్తుతం చాహల్ కు భారత జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2024 స్క్వాడ్ లో స్థానం దక్కినా అతనికి  ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత సెలక్టర్లు చాహల్ పూర్తిగా పక్కన పెట్టేశారు. భవిష్యత్ లోనూ చాహల్ భారత జట్టులోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. అతని వయసు 34 ఏళ్ళు కావడం దీనికి ప్రధాన కారణం. 34 ఏళ్ల చాహల్ ఇప్పటివరకు భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 217 వికెట్లు పడగొట్టాడు. 96 వికెట్లతో భారత్ తరపున చాహల్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.