కూలీ సెట్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇంట్రెస్టింగ్ ఫోటోస్

 కూలీ సెట్స్‌‌‌‌‌‌‌‌  నుంచి ఇంట్రెస్టింగ్ ఫోటోస్

రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’. వరుస బ్లాక్ బస్టర్స్‌‌‌‌‌‌‌‌తో మెప్పిస్తున్న లోకేష్ కనగరాజ్ దీనికి దర్శకుడు. తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్‌‌‌‌‌‌‌‌ షాహిర్‌‌‌‌‌‌‌‌తో పాటు సత్యరాజ్ శ్రుతిహాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.  శుక్రవారం దర్శకుడు లోకేష్ కనగరాజ్ బర్త్ డే సందర్భంగా విషెస్‌‌‌‌‌‌‌‌ చెబుతూ ఈ మూవీ సెట్స్‌‌‌‌‌‌‌‌ నుంచి కొన్ని ఫొటోస్‌‌‌‌‌‌‌‌ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ఇందులో నటిస్తున్న స్టార్స్‌‌‌‌‌‌‌‌తో ఆయా సీన్స్‌‌‌‌‌‌‌‌ గురించి వివరిస్తూ సెట్స్‌‌‌‌‌‌‌‌లో కనిపించాడు లోకేష్. మరోవైపు ఈ చిత్రంలో అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ కూడా నటించబోతున్నట్టు గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. శుక్రవారం ఆమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్త్‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా విష్‌‌‌‌‌‌‌‌ చేస్తూ తనతో కలిసి చర్చిస్తున్న ఓ ఫొటోను  లోకేష్ షేర్ చేశాడు. తన పోస్ట్‌‌‌‌‌‌‌‌లో ‘కూలీ’ చిత్రం ప్రస్తావన ఎక్కడా లేనప్పటికీ అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇందులో నటిస్తుండడం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది.