తారామతిపేట్ చోరీ కేసులో ట్విస్ట్..

తారామతిపేట్ చోరీ కేసులో ట్విస్ట్..
  •  నిందితుల వద్ద 2.5 తులాల గోల్డ్, 918 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం

అబ్దుల్లాపూర్ మెట్,వెలుగు: ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు దొరికారు. నిందితుల వద్ద 2 తులాల గోల్డ్ ,918గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల15న రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధి అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేట్ కు చెందిన చేపూరి జయశ్రీ తన మనవడి హెల్త్ బాగోలేదని కుటుంబసభ్యులతో కలిసి బోయినపల్లికి వెళ్లింది. మరుసటి రోజు ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉండి 32 తులాల గోల్డ్ నగలు, 180 తులాల వెండి వస్తువులు దొంగలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు బాధిత కుటుంబం కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.  సోమవారం ఎల్ బీనగర్ సాగర్ రింగ్ రోడ్డులో బైక్ పై వెళ్తూ పోలీసుల తనిఖీల్లో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వీరిని మీర్ పేట్ నందనవనానికి చెందిన వరికుప్పల వెంకటేశ్(48), ఖమ్మం జిల్లాకు చెందిన బాతుల గోపి(29) గా గుర్తించారు. నిందితుల వద్ద 2.5తులాల గోల్డ్ నగలు,918 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 

చోరీలో ట్విస్ట్..

 చోరీ కేసులో పోలీసుల విచారణలో జరిగింది వాస్తవమే అయినా .. ఆ ఇంట్లో పోయింది 2.5తులాల బంగారు నగలు, 918 తులాల వెండి వస్తువులు అని తేలాయి. కానీ బాధితులు మాత్రం 32 తులాల గోల్డ్, 180 తులాల వెండి చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయగా.. అది వాస్తవం కాదని తేలింది. బాధితులు నిజాయతీగా ఫిర్యాదు చేస్తే సత్వర న్యాయం జరుగుతుందని పోలీసులు సూచించారు.