టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా హైదరాబాదీ.. ఎవరీ అభిషేక్ నాయర్?

టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా హైదరాబాదీ.. ఎవరీ అభిషేక్ నాయర్?

రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరో తేలిపోయింది. ఊహించినట్టుగానే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ ప్రధాన కోచ్ గా ఎంపికయ్యాడు. మంగళవారం (జూలై 9) ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గంభీర్ కోచ్ గా  ప్రకటించిన వెంటనే కోచింగ్ స్టాఫ్ విషయంలో అతనికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు సమాచారం. దీంతో గంభీర్ తనకు బ్యాటింగ్ కోచ్ గా అభిషేక్ నాయర్ ను, బౌలింగ్ కోచ్ గా వినయ్ కుమార్ ను ఎంచుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే బ్యాటింగ్ కోచ్ గా రాబోతున్న అభిషేక్ నాయర్ మన తెలుగోడే కావడం విశేషం. 

ఎవరీ అభిషేక్ నాయర్.. ? 
 
అభిషేక్ మోహన్ నాయర్ హైదరాబాద్ కు చెందినవాడు. అయితే ముంబై వెళ్లి అక్కడ స్థిరపడి అక్కడ తన క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు. ఇతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్... రైట్ హ్యాండర్ బౌలర్. ముంబై తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ మొదటి సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కింగ్స్ XI పంజాబ్, పూణే వారియర్స్ ఇండియా, రాజస్థాన్ రాయల్స్ జట్టులకు ఆడాడు. 

2018 నుంచి అభిషేక్ నాయర్ కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్నాడు. సికింద్రాబాద్‌లో జన్మించిన ఈ మాజీ బ్యాటర్ టీమిండియా తరఫున మూడు మ్యాచ్‌లను ఆడాడు. 2009 లో భారత్ తరపున అరంగేట్రం చేసిన ఈ ఆల్ ఆల్ రౌండర్ అదే సంవత్సరం చివరి వన్డే ఆడారు.