మార్టిగేజ్‌‌‌‌ కోసం లంచం డిమాండ్‌‌‌‌‌‌

  • ఏసీబీ అదుపులో మెట్‌‌‌‌పల్లి సబ్‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌, ఆఫీస్‌‌‌‌ సబార్డినేట్‌‌‌‌తో పాటు డాక్యుమెంట్‌‌‌‌ రైటర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌

మెట్‌‌‌‌పల్లి, వెలుగు : మార్టిగేజ్‌‌‌‌ కోసం లంచం డిమాండ్‌‌‌‌ చేసిన ఓ సబ్‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌, ఆఫీస్‌‌‌‌ సబార్డినేట్‌‌‌‌, డాక్యుమెంట్‌‌‌‌ రైటర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన సుంకె విష్ణుకు మెట్‌‌‌‌పల్లిలోని సాయిరాంనగర్‌‌‌‌ కాలనీలో 266 గజాల స్థలం ఉంది. దీనిని మార్టిగేజ్‌‌‌‌ చేసేందుకు గత నెల 28న మెట్‌‌‌‌పల్లి సబ్‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌ ఆసిఫొద్దీన్‌‌‌‌ను సంప్రదించాడు. ఆయన ఆఫీస్‌‌‌‌ సబార్డినేట్‌‌‌‌ బానోతు రవిని కలవాలని సూచించాడు.

దీంతో అతడు రవి వద్దకు వెళ్లగా మార్టిగేజ్‌‌‌‌ చేసేందుకు రూ. 10 వేలు అవుతుందని చెప్పగా అంత ఇచ్చుకోలేనని విష్ణు చెప్పడంతో రూ. 5 వేలకు ఒప్పందం కుదిరింది. తర్వాత విష్ణు ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచనలతో విష్ణు బుధవారం డాక్యుమెంట్‌‌‌‌ రైటర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ ఆర్మూర్‌‌‌‌ రవిని కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు రవిని రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. దీంతో ఆఫీస్‌‌‌‌ సబార్డినేట్‌‌‌‌ బానోతు రవి, సబ్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌ ఆసిఫొద్దీన్‌‌‌‌ సూచన మేరకే తాను డబ్బులు తీసుకున్నానని చెప్పడంతో ఏసీబీ ఆఫీసర్లు వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదుచేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.