ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు : ఈడీకి వివరాలు అందించిన ఏసీబీ

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు : ఈడీకి వివరాలు అందించిన ఏసీబీ

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి. ఈ  కేసులో వివరాలను ED (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కి అందజేసింది ACB. ఆర్థికశాఖ రికార్డ్స్, HMDA చెల్లింపుల వివరాలు, ఒప్పంద పత్రాలతో పాటు.. FIR కూడా ED కి అందజేసింది. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో రూ.55 కోట్లు క్యాబినెట్ అనుమతి లేనిదే విడుదల చేయడంపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. అప్పటి పురపాలక మంత్రి కేటీఆర్ సహా ఆ శాఖ అధికారులపై కేసులు నమోదయ్యాయి. 

అదేవిధంగా ఫార్ములా  ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఏసీబీ. కౌంటర్ లో కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయడంతో పాటు, నేరపూరిత కుట్రకు  పాల్పడ్డారని ACB  కౌంటర్ లో పేర్కొంది.  క్యాబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై KTR ఒత్తిడి చేశారని పేర్కొంది. 

అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయలు బదిలీ చేశారని,  దీనివలన HMDAకు రూ.8 కోట్ల అదనపు భారం పడిందని కోర్టుకు తెలిపింది.  అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమేని తెలిపింది.   కేటీఆర్ వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని ACB కౌంటర్ లో పేర్కొంది.

Also Read :- త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్.. హైడ్రా FM రేడియో ఛానెల్

అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే KTR పైన FIR నమోదు చేశామని తెలిపిన ACB..  రాజకీయ కక్షతోనో, అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామనడం సరైనది కాదని తెలిపింది.  మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించారని తెలిపింది.  FEO కు చెల్లింపులు జరపాలని స్వయంగా KTR వెల్లడించినట్లు తానే చెప్పారని వెల్లడించింది. 

 FIR నమోదు ప్రక్రియ ఆలస్యం అయినందున కేసు కొట్టేయాలని  కోరడం సరైంది కాదని పేర్కొంది. తీవ్రమైన అభియోగాలు  ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయవచ్చన్న సుప్రీంకోర్టు ఆదేశాలు న్నాయనని ఈ సందర్భంగా  ACB గుర్తు చేసింది.