ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. జనవరి 9న ఉదయం 10.30 నుంచి అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్నారు. కేటీఆర్ వెంట సీనియర్ లాయర్ రామచంద్రారావు ఉన్నారు. లైబ్రరీ రూం నుంచి విచారణను పరిశీలిస్తున్నారు. దాదాపు 6 గంటలుగా విచారణ జరుగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు అరంగట పాటు లంచ్ బ్రక్ ఇచ్చారు. తర్వాత ఇంటరాగేషన్ స్టార్ట్ చేశారు అధికారులు.
ALSO READ | కేటీఆర్కు సుప్రీంలోనూ చుక్కెదురు : తక్షణ విచారణ కుదరదన్న కోర్టు
కేటీఆర్ ను ఏసీబీ అధికారులు జేడీ రితిరాజ్, ఏఎస్సీ శివరాం శర్మ, డీఎస్పీ మాజీద్ ఖాన్ కేటీఆర్ పై వరుసగా ప్రశ్నలు వేస్తున్నారు. దాదాపు 35 ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అనుమతుల్లేకుండా హెచ్ఎండీఏ నిధుల మళ్లింపు, ఈ రేస్ నిర్వహణకు కారణాలపై ఏసీబీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. మరో వైపు జనవరి 8న 9 గంటల పాటు విచారించిన ఐఏస్ అధికారి అర్వింద్ ను ఇవాళ కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
కేటీఆర్ కు ఏసీబీ ప్రశ్నలు.?
- అసలు హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది. ఎవరు ఆమోదించారు
- హైదరాబాద్ లోనే ఈ రేస్ ఎందుకు నిర్వహించాలనుకున్నారు
- ఈ రేస్ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వచ్చిందా?
- ఎఫ్ఈవో కంపెనీకి ఈ రేస్ బాధ్యతలు ఎందుకు అప్పగించారు
- నిబంధనలు ఉల్లంఘించి రూ.55 కోట్లు నగదును ఎందుకు బదిలీ చేశారు
- ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఎందుకు నగదు బదిలీ చేశారు
- రూల్స్ బ్రేక్ చేసి నగదును బదిలీ చేయాల్సిన అవసరం ఏముంది?
- ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదనుకున్నారా?
- కేబినెట్ ఆమోదం లేకుండానే ఎందుకు నగదు బదిలీ చేశారు
- నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు మిమ్మల్ని హెచ్చరించారా.?
- బదిలీ చేసిన రూ.55 కోట్లు తిరిగి హెచ్ఎండీఏ ఖాతాకు చేరాయా?
- ఎఫ్ఈవో సంస్థ ఈ రేస్ నుంచి ఎందుకు తప్పుకుంది.?
- ఎఫ్ఈవో సంస్థ మీకు ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు ఇచ్చింది.?
- కంపెనీ నుంచి మీకేమైనా లావాదేవీలు ఉన్నాయా?
- మీరు బదిలీ చేయమంటేనే నగదు బదిలీ చేశానని అరవింద్ చెప్పారు.. దీనికి మీ సమాధానం ఏంటి.?