ఫార్ములా– -ఈ రేసుతో వచ్చిన లాభమెంత?

  • సీజన్ 9 కోసం ఎంత ఖర్చయింది?
  • అడ్వర్టయిజ్​మెంట్స్ ఆదాయం ఎవరికి వెళ్లింది? 
  • సీజన్ 10 నుంచి ఎందుకు తప్పుకున్నారు?
  • గ్రీన్ కో, ఏస్ నెక్ట్స్ జెన్ ఎండీ అనిల్ కుమార్​ను ప్రశ్నించిన ఏసీబీ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫార్ములా–ఈ రేసు కేసులో గ్రీన్‌‌‌‌కో అనుబంధ‌‌‌‌ సంస్థ ఏస్‌‌‌‌ నెక్ట్స్ జెన్ ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. గ్రీన్‌‌‌‌కో, ఏస్‌‌‌‌ నెక్ట్స్ జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ ను శనివారం విచారించింది. ఫార్ములా-–ఈ రేసు సీజన్ 9 నిర్వహణతో ఎంత లాభం వచ్చింది? దానికి ఎంత ఖర్చయింది? అని ఆయనను ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ కేసులో విచారణకు రావాలని అనిల్ కుమార్ కు ఏసీబీ గురువారం నోటీసులు ఇచ్చింది. ఆయన శనివారం ఉదయం 11:30 గంటలకు విచారణకు రావాల్సి ఉండగా, ఫ్లైట్‌‌‌‌ ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. 

ఆలస్యమవుతుందని మెయిల్‌‌‌‌ ద్వారా ముందస్తు సమాచారం ఇచ్చారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌‌‌‌ మాజీద్‌‌‌‌ అలీ ఆధ్వర్యంలోని టీమ్.. అనిల్ కుమార్ ను సాయంత్రం 5:30 గంటల వరకు దాదాపు రెండున్నర గంటల పాటు విచారించింది. ఈ కేసులో నిందితులైన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌, సీనియర్ ఐఏఎస్‌‌‌‌ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డి స్టేట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఆధారంగా ప్రశ్నించింది. ఏసీబీ ప్రశ్నలకు అనిల్‌‌‌‌కుమార్ సానుకూల సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఏస్‌‌‌‌ నెక్ట్స్ జెన్‌‌‌‌ అగ్రిమెంట్స్‌‌‌‌, బ్యాంక్‌‌‌‌ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించినట్టు సమాచారం.  

ఎఫ్ఈవోకు డబ్బులు ఎందుకు చెల్లించలేదు? 

ఎఫ్ఈవోకు చెల్లించాల్సిన ఇన్ స్టాల్ మెంట్స్ పైనా ఏసీబీ ఆరా తీసింది. ఎఫ్ఈవోకు ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ మూడు ఇన్ స్టాల్ మెంట్స్ చెల్లించాల్సి ఉండగా, ఎందుకు చెల్లించలేదని అనిల్ కుమార్ ను ప్రశ్నించినట్టు తెలిసింది. అసలు సీజన్ 9 కోసం ఏస్ నెక్ట్స్ జెన్ చేసిన ఖర్చెంత? వచ్చిన లాభమెంత? ఈ ఈవెంట్ నిర్వహణతో ఎఫ్‌‌‌‌ఈవో సంస్థకు గానీ, మున్సిపల్ శాఖకు గానీ ఏమైనా ఆదాయం సమకూరిందా? సీజన్‌‌‌‌ 9 టైమ్ లో అడ్వర్టయిజ్ మెంట్స్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం ఎవరి అకౌంట్ లోకి వెళ్లింది? తదితర అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం. గ్రోన్‌‌‌‌కో, ఏస్‌‌‌‌ నెక్ట్స్ జెన్‌‌‌‌ సంస్థలకు చెందిన బ్యాంక్‌‌‌‌ ట్రాన్సాక్షన్స్‌‌‌‌, అగ్రిమెంట్స్‌‌‌‌ను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అవసరమైన సమయంలో మళ్లీ విచారణకు రావాలని అనిల్ కుమార్ ను ఏసీబీ ఆదేశించింది.

ఎంత ఖర్చయింది? 

హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించ తలపెట్టిన ఫార్ములా–ఈ రేసు సీజన్‌‌‌‌ 9,10,11,12కు ప్రమోటర్ గా వ్యవహరిస్తామని ఏస్‌‌‌‌ నెక్ట్స్ జెన్ సంస్థ అగ్రిమెంట్స్ చేసుకుంది. సీజన్ 9కు సంబంధించి 2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 25న మొదటి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్‌‌‌‌కు ముందు, ఆ తర్వాత ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌‌‌‌ (ఎఫ్ఈవో) కంపెనీ, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో ఎన్ని మీటింగ్స్ నిర్వహించారనే కోణంలో అనిల్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నించినట్టు తెలిసింది. 

ALSO READ : ఇక మీ వంతు.. ఏసీబీ విచారణకు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు

ఈవెంట్స్‌‌‌‌ నిర్వహణకు ఎన్ని కోట్లు ఖర్చు పెడతామని ప్రతిపాదించారు? అందులో ఏస్‌‌‌‌ నెక్ట్స్ జెన్ వాటా ఎంత? అని ఆరా తీసినట్టు సమాచారం. సీజన్‌‌‌‌ 9 కోసం హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు రూ.12 కోట్లు ఖర్చు చేస్తే, ప్రమోటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఏస్‌‌‌‌ నెక్ట్స్ జెన్ సంస్థ ఎంత ఖర్చు చేసింది? విదేశాల నుంచి వచ్చిన రేసర్లకు, వివిధ కంపెనీల ప్రతినిధులకు కల్పించిన సౌకర్యాలేంటి? అనే అంశాలపై సమాధానాలు రాబట్టినట్టు తెలిసింది.