యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆలేరు ఎంపీడీఓ ఆఫీస్ లో పనిచేస్తున్న పంచాయతీ రాజ్ అధికారి ఏఈ రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శారాజిపేట గ్రామంలో సీసీ రోడ్డు కాంట్రాక్టర్ శ్రీశైలం నుంచి రూ. 80వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికాడు. శారాజిపేట గ్రామంలో 16 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ దగ్గర 5 శాతం వాటా కింద లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు.
గత రెండు నెలలుగా ఎంబి రికార్డు చేయకుండా తిప్పుతుండగా విసుగు చెందిన కాంట్రాక్టర్.. అక్టోబర్ 5వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసాడు. అప్పటి నుంచి రమేష్ పై నిఘా పెట్టారు. ఈరోజు(అక్టోబర్ 07) కాంట్రాక్టర్ నుంచి రమేష్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ DSP MV శ్రీనివాస్ తెలిపారు.