ఉమామహేశ్వర ఆలయానికి రూ.25 లక్షల విరాళం

ఉమామహేశ్వర ఆలయానికి రూ.25 లక్షల విరాళం

అచ్చంపేట, వెలుగు: శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధిగాంచిన ఉమామహేశ్వర ఆలయానికి అచ్చంపేట రెడ్డి సేవా సంఘం నేతలు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు. శనివారం రెడ్డి సేవా సంఘం నేతలు ఆలయాన్ని సందర్శించి, ఆలయ అభివృద్ధికి తమవంతుగా రూ.25 లక్షల చెక్కును ఆలయ చైర్మన్  బీరం మాధవరెడ్డికి అందజేశారు. ఆలయాన్ని డెవలప్​ చేసేందుకు విరాళాన్ని అందజేసినట్లు కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 

ఆలయానికి భారీగా విరాళం అందజేసిన రెడ్డి సేవా సంఘం నేతలను ఆలయ కమిటీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈవో శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు వాడకట్టు వినోద్, రెడ్డి సేవా సంఘం నేతలు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి , బాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, తిరుపతిరెడ్డి  పాల్గొన్నారు.