వంట గదిలోపడగ విప్పిన నాగుపాము

వంట గదిలోపడగ  విప్పిన నాగుపాము

అశ్వారావుపేట, వెలుగు: వంట చేసేందుకు కిచెన్ లోకి వెళ్లిన ఓ మహిళ  గ్యాస్ పొయ్యి దగ్గర పగడ విప్పిన నాగుపామును చూసి  ఆందోళనకు గురైంది.  భయపడి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది.  పట్టణంలోని జంగారెడ్డిగూడెం రోడ్ లో పెట్రోల్ బంక్ పక్కన మల్లికార్జున్ రావు   ఇంట్లో భార్య వంట చేసేందుకు కిచెన్ రూమ్ కి వెళ్లింది. అక్కడ  నాగుపాము కనిపించింది. 

 రెండు గంటలసేపు అలాగే పడగ విప్పి ఉండటంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి నాగుపామును ఓ డబ్బాలో బంధించి అడవిలో విడిచి పెట్టారు.   పడగ విప్పిన  వీడియో, ఫోటోలు  సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.