ట్రాఫిక్ డ్యూటీలో హైడ్రా...డీఆర్‌‌‌‌ఎఫ్ సిబ్బందికి ట్రైనింగ్ ఏర్పాట్లు

ట్రాఫిక్ డ్యూటీలో హైడ్రా...డీఆర్‌‌‌‌ఎఫ్ సిబ్బందికి ట్రైనింగ్ ఏర్పాట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ట్రాఫిక్ స‌‌మ‌‌స్యల ప‌‌రిష్కారానికి హైడ్రా కార్యాచరణ రూపొందిస్తున్నది. హైడ్రాకు చెందిన డీఆర్ఎఫ్ సిబ్బందిని ట్రాఫిక్ నియంత్రణలో వినియోగించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. విధివిధానాలపై సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్‌‌,హెడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్‌‌ ఆధ్వర్యంలో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో రెండు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

హైడ్రాకు చెందిన డీఆర్ఎఫ్ టీమ్స్‌‌ను కూడా ట్రాఫిక్‌‌లో వినియోగించేందుకు అవసరమైన శిక్షణ ఇప్పించాల‌‌ని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 144 వాట‌‌ర్ లాగింగ్ పాయింట్స్ ఉండగా.. 65 హైద‌‌రాబాద్ ప‌‌రిధిలోనే ఉన్నాయి. భారీవ‌‌ర్షాలు, ప్రకృతి విపత్తుల సమయాల్లో మినహా ఇతర సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ‌‌కు ప‌‌ని చేసే విధంగా చర్యలు చేపట్టారు.

వ‌‌ర్షాలకు రోడ్లపై వ‌‌ర‌‌ద నీటిని క్లియర్ చేసేందుకు డీఆర్ఎఫ్ టీమ్స్‌‌,ట్రాఫిక్ పోలీసులతో  క‌‌లిసి ప‌‌నిచేస్తాయి. వ‌‌ర‌‌ద‌‌తో కాలువ‌‌లు,పైపుల్లో పేరుకుపోయిన వ్యర్థాల‌‌ను తొల‌‌గిస్తారు. కాల‌‌నీల్లో ఫుట్‌‌పాత్‌‌ల‌‌ను ఆక్రమించి నిర్మించిన శాశ్వత దుకాణాలను తొల‌‌గించ‌‌డం కోసం రెండు విభాగాలకు చెందిన టీమ్స్ పనిచేయనున్నాయి.