
మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ మూవీ ఎప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్డేట్స్, ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. తాజాగా మంచు విష్ణు అండ్ టీమ్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా సీనియర్ నటుడు రఘుబాబు పాల్గోన్నారు. కన్నప్ప చిత్రంపై వస్తోన్న ట్రోల్స్పై తనదైన శైలిలో కొన్ని కామెంట్లు చేశారు.
రఘుబాబు మాట్లాడుతూ.. "కన్నప్ప సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేసారంటే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవతారని" నటుడు రఘుబాబు అన్నారు. ఆ శివుడు ఎవ్వర్నీ వదిలిపెట్టడు.. వంద శాతం ట్రోల్ చేసిన ప్రతీ ఒక్కరు ఫినిష్" అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇపుడీ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. ట్రోలర్స్ ని టచ్ చేసేలా చేసిన రఘుబాబు మాటలకు ఎవరైనా స్పందిస్తారో లేదో అని నెటిజన్లు చర్చించుకున్నారు.
If anyone Trolls #Kannappa movie, Lord Shiva will KannaKuthum !!
— Christopher Kanagaraj (@Chrissuccess) March 24, 2025
Adei😀
pic.twitter.com/5cIYpUTruB
అయితే, కన్నప్ప ఫస్ట్ టీజర్ తోనే.. ట్రోల్స్ మొదలయ్యాయి. కన్నప్ప సినిమా టీజర్ లో ఉన్న తప్పులని ట్రోల్ చేస్తూ పలువురు వీడియోలు కూడా చేసారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కన్నప్ప టీజర్ నెగిటివ్ గా బాగా వైరల్ అవుతూ వచ్చింది. మంచి సినిమాని మంచి ఫ్యామిలీ చెడగొడుతున్నారని నెటిజన్స్ విమర్శలు కూడా చేసారు.
ALSO READ | Dia Mirza: రియా చక్రవర్తికి సీబీఐ క్లీన్ చిట్.. మీడియా క్షమాపణ చెప్పాలని నటి దియా మీర్జా డిమాండ్
అయితే, తెలుగులోనే తమ చిత్రంపై ఎక్కువగా నెగెటివిటీ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని మంచి విష్ణు అన్నారు. అంతేకాకుండా కన్నప్ప నుంచి రిలీజైన ‘శివ శివ శంకరా’ ఫస్ట్ సాంగ్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా నుంచి సెకండ్ టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో విష్ణు పరమశివుడు భక్తుడిగా కనిపించబోతున్నాడు. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది.