Pindam Movie Review: ఆత్మలతో భయపెట్టే హార‌ర్ క్రైమ్ థ్రిల్లర్

Pindam Movie Review: ఆత్మలతో భయపెట్టే హార‌ర్ క్రైమ్  థ్రిల్లర్

కొన్ని చిత్రాలు కామెడీతో నవ్విస్తాయి..కొన్ని ఎమోషన్స్ తో బాధిస్తాయి..కొన్ని ఆలోచింపజేస్తాయి..మరికొన్ని హార్రర్ తో భయపట్టేస్తాయి. ఇదంతా ఇపుడు ఎందుకు అంటే.ఇవాళ  థియేటర్లో రిలీజైన పిండం మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే..ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి..మేకర్స్ చెప్పే ఒకే మాట..ఎప్పుడూ లేనంత భయపెట్టే సినిమా ఇదంటూ చెబుతూ వస్తున్నారు.అసలు భయపెట్టేంత ఇంటెన్స్ని డైరెక్టర్ పుట్టించాడో లేదో తెలుసుకుందాం. 

కథేంటంటే..

ముందుగా మేకర్స్ చెప్పినట్లే..ఫస్ట్ ఆఫ్ అంతా భయపెట్టడానికి అల్లుకున్న స్టోరీ..ప్రేక్షకులకు భయాన్ని కలిగించేలా ఉంది. ఈ మూవీలో ఒకరికి ఒకరు ఫేమ్ శ్రీరామ్ (Sriram) క్రైస్తవ మతానికి చెందిన ఆంథోని గా నటించారు. ఇతను ఒక రైస్‌ మిల్లులో అకౌంటెంట్‌ గా కనిపించారు. ఆంథోని భార్యగా మేరి (ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి  సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. హ్యాపీగా సాగే వీరి జీవితంలోకి అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. గర్భవతిగా ఉన్న భార్య మేరి ఉన్నట్టుండి ఆస్పత్రి పాలవుతుంది. అంతేకాకుండా వీరి నివసించే ఇంట్లో ఏదో వింత శక్తులు ఉన్నట్లు అలజడి మొదలవుతుంది. అలాంటి తరుణంలోనే మూగదైన చిన్నకూతురు తారను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ ఫ్యామిలీని చంపేందుకు క్షుద్రశక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తాయి. ఇంకా వారిని కాపాడానికి అన్న‌మ్మ (Eeswari Rao) ఆంథోని ఇంటికి వస్తోంది. అన్నమ్మకు త‌న తండ్రి ద్వారా అబ్బిన తాంత్రిక శక్తియుక్తులతో చుట్టుప్రక్కల ఉండే ఊర్లో ప్రజలకి సాయం చేస్తూ ఉంటుంది. ఎటువంటి ఆత్మ‌లు ఆవ‌హించిన‌ప్పుడు త‌న‌దైన శైలిలో ప‌సిగ‌ట్టి, వాటి నుంచి విముక్తి క‌ల్పిస్తూ స్వాంత‌న చేకూరుస్తూ ఉంటుంది. ఈ సినిమా కథంతా ఆంథోని ఫ్యామిలీని వేధిస్తున్న ఆత్మ ఎవరిదో కనిపెట్టే ప్రయత్నంలో అన్నమ్మ ఉండగా..భయంకరమైన నిజాలు వెలుగులోకి రావడం. ఇది ఒక ఆత్మ కాదని..ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తుంది.

అసలు ఆ  ఆత్మల కథేంటి? వాళ్లు ఎలా చనిపోయారు? ఆంథోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆ ఇంట్లో అంతకు ముందు ఏం జరిగింది? ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది? చిన్న కూతురు తారను ఆవహించిన ఆత్మను విదిలించేక్రమంలో అన్నమ్మకు ఎదురదైన సమస్యలు ఏంటి? చివరకు ఆంథోని ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షించింది? అనే ప్రశ్నలతో సినిమా ప్రథమార్ధం ఇంట్రెస్టింగ్ గా వెళుతోంది. ఇక అదే సమయంలో 1932లో జరిగిన ఓ యధార్థ సంఘటన విషయాలను తెలుసుకునేందుకు లోక్‌నాథ్‌ (అవసరాల శ్రీనివాస్‌) ఎందుకు ఆసక్తి చూపాడు? లోక్‌నాథ్ అన్న‌మ్మ వద్దకు రావడంతో..అతనికి ఎలాంటి విషయాలు తెలుసుకోగలిగాడు అనేది ‘పిండం’సినిమా. 

ఎలా ఉందంటే..

ఆత్మల చుట్టూ తిరుగుతూ..ఆద్యంతం ఉత్కంఠతో కూడిన పిండం మూవీ ఇంటెన్స్ గా సాగుతూ..ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తుంది. సినిమా ఫస్టాఫ్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో కథలో భయపెట్టే ఎలిమెంట్స్ ని చూపించడంతో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అన్నమ్మ వచ్చే ప్రతి సీన్స్ లో ఆత్మల చుట్టూ తిరిగే కథాంశాలను వివరించే సీన్స్ ..ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. హార‌ర్ చిత్రాలు ఎక్కువ‌గా కామెడీతో ఆడియన్స్ ను సీరియస్ యాంగిల్ లో చూపించడానికి ట్రై చేస్తుంటారు. కానీ పిండం మూవీ మాత్రం కథలో సాగే ఆత్మల చూపే ఇంటెన్స్ ని..ప్రేక్షకుల్లో కలిగే భయాన్ని మాత్రమే చూపించడంలో వైవిధ్యత కనబరిచింది.

ఈ కథ 1992లో ప్రారంభమై..1932లో సాగుతున్న చూపెడతారు. ఈ సినిమా మొదలయ్యాక ఫ్యామిలీ ఎపిసోడ్స్ పరిచయం చేశాక..ఓ భయంకరమైన సన్నివేశంతో అన్నమ్మ పాత్ర ఎంట్రీ ఇస్తుంది.ఈ సీన్ తో ఆడియాన్స్ కు థ్రిల్ అయ్యేలా చూపించారు. ఆ తర్వాత కేస్‌ స్టడీ అంటూ లోక్‌నాథ్‌ అన్నమ్మ వద్దకు రావడం..ఆ క్రమంలో అన్నమ్మ గురించి తెలుసుకునే సమయంలో కథ 1932లోకి వెళ్తుంది. అక్కడ నుంచి అసలు కథ షురూ అవ్వడం కథపై ఆసక్తిని పెంచుతోంది. ఆంథోనీ ఫ్యామిలీ ‘నాయుడమ్మ’ఇంట్లోకి రావడంతోనే ఇంట్లోనే దెయ్యం ఉంటుందని ప్రేక్షకులకు ముందుగానే అర్థమై పోతుంది. గ‌దిలో ఏవో వింత శ‌బ్దాలు వినిపించడం, కుర్చీ ఊగ‌డం, మూల‌న ఉన్న కొన్ని వ‌స్తువులు క‌ద‌ల‌డం వంటి స‌న్నివేశాలతో ఆసక్తి కలుగుతోంది. కానీ సినిమా ఆద్యంతం ప‌దే ప‌దే ఇవే సీన్స్ చూపించ‌డంతో క‌థ ఎంత‌కీ ముందుకు సాగుతున్న‌ట్టు అనిపించదు. అలాగే ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్ ఆడియన్స్ కి సెకండాఫ్ పై ఆస‌క్తి పెంచుతుంది. తాంత్రిక శ‌క్తుల‌పై అవ‌గాహ‌న ఉన్న అన్న‌మ్మ కూడా ఆ ఇంట్లోకి రావడం..ఆత్మ‌ల్ని పసిగ‌ట్ట‌డం..కొన్ని సీన్స్ లో అన్నమ్మ కూడా వాటికి భయపడటం ప్రేక్షకుల్లో భయాన్ని కలిగిస్తాయి. అలాగే అన్నమ్మ ఆత్మలను తొలగించేందుకు చేసే ప్రయత్నాలు ఓ వర్గం ఆడియన్స్ కి అంతగా రుచించవు అనే చెప్పుకోవాలి. కానీ అన్నమ్మ చెప్పే ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీ మాత్రం ప్రేక్షకుల గుండెలను పిండేస్తుంది.

డెబ్యూ డైరెక్టర్ సాయి కిరణ్‌ రాసుకున్న భయపెట్టే సీన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యేలా..సెటిల్ ఐడియాలజితో తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాలను మాత్రం ఇంకాస్తా బిగా రాసి ఉండింటే బాగుండేదని ఫీలింగ్ కలుగుతోంది. ఏదేమైనా హారర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి పిండం మూవీ  నచ్చుతుంది. కథ రొటీన్‌గా ఉన్నా..కథనంలో సాగే  సన్నివేశాలు మాత్రం ఆడియన్స్ ని భయపెడతాయి. కానీ,క‌డుపులో పిండానికీ, బ‌య‌టి ఆత్మ‌కీ ముడిపెట్ట‌డంలో పెద్ద‌గా లాజిక్ క‌నిపించ‌దు.

 ఎవ‌రెలా చేశారంటే?

ఆత్మలను బంధించే మంత్రగత్తె పాత్రలో సీనియర్ నటి ఈశ్వరి రావు పోషించిన పాత్ర సినిమాకే కీ రోల్ అని చెప్పుకోవాలి. హీరో శ్రీరామ్ తన ఫ్యామిలీని  ఆత్మల నుంచి రక్షించుకునే పాత్రలో కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. తన జీవితంలో చూసిన అత్యంత భయంకరమైన..కొన్ని ఆత్మల గురించి ఈశ్వరి రావు చెప్పే విధానం ఆసక్తి కలిగేలా నటించింది. ఇద్ద‌రు చిన్నారులు ఈ సినిమాకి కీల‌కంగా నటించిన పాత్రలు చాలా బిగా చేశారు. ముఖ్యంగా తారగా న‌టించిన అమ్మాయి సైగల‌తో మాట్లాడుతూ ఆడియన్స్ ను క‌ట్టిప‌డేస్తుంది డిఫరెంట్‌ లుక్‌, బాడీ లాంగ్వేజ్‌తో శ్రీరామ్‌ ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా తన ఫ్యామిలీని ఆత్మల నుంచి రక్షించుకునే పాత్రలో కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఇక మేరీగా ఖుషి రవి ఓ డిఫరెంట్‌ పాత్రలో కనిపించింది. సినిమా మొత్తం గర్భవతిగానే కనిపిస్తూ..ఎమోషన్ ని కనబరిచింది. లోక్‌నాథ్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు.

 

ఈ సినిమాకు ప్రధాన బలం కృష్ణ సౌరభ్‌ సూరంపల్లి సంగీతం. తనదైన బీజీఎంతో..ఇంటెన్స్ కలిగించే శబ్దాల‌తోనే భ‌య‌పెట్టాడు. సతీష్‌ మనోహర్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రొడ్యూసర్ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా చూపించారు.