హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా!

హీరో సుమంత్  రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా!

హీరో సుమంత్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది. సుమంత్ కుమార్ వెడ్స్ పవిత్ర అని వెడ్డింగ్ కార్డు పై  ఉంది. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేది  క్లారిటీ లేదు. సుమంత్ కు ఇంతకుమందు 2004 లో హీరోయిన్ కీర్తిరెడ్డితో పెళ్లి జరిగింది. పలు కారణాల వల్ల 2006లో విడాకులు తీసుకున్నారు. మళ్లీ ఇపుడు సెకండ్ మ్యారేజ్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది . సుమంత్ ప్రేమకథ మూవీతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ప్రస్తుతం అనగనగా ఓ రౌడీ అనే సినిమాలో నటిస్తున్నారు.