VijayaShanthi: ఇండస్ట్రీ బతకాలి, చావకూడదు.. నాటి, నేటి పరిస్థితులపై విజయశాంతి ముచ్చట్లు

VijayaShanthi: ఇండస్ట్రీ బతకాలి, చావకూడదు.. నాటి, నేటి పరిస్థితులపై విజయశాంతి ముచ్చట్లు

డేరింగ్ అండ్ డాషింగ్‌‌‌‌ క్యారెక్టర్స్‌‌‌‌తో లేడీ సూపర్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు విజయశాంతి. కొంత గ్యాప్‌‌‌‌ తర్వాత ఆమె నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్‌‌‌‌ వైజయంతి’.కళ్యాణ్‌‌‌‌ రామ్‌‌‌‌కు తల్లిగా పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా ఆమె నటించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా విజయశాంతి ఇలా ముచ్చటించారు. 

ఒక మంచి సినిమా చేశామని మా అందరికీ తృప్తినిచ్చిన చిత్రం ‘అర్జున్‌‌‌‌ సన్నాఫ్‌‌‌‌ వైజయంతి’.లాంగ్‌‌‌‌ గ్యాప్‌‌‌‌ తర్వాత పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా, మదర్‌‌‌‌‌‌‌‌గా పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ పాత్రలో కనిపించడం వృత్తిపరంగా నాకు సంతృప్తిని ఇచ్చింది.  తమ రాములమ్మను ఎలాగైతే చూద్దామని జనం కోరుకున్నారో అలాంటి ఓ మంచి పాత్రలో కనిపించడం పట్ల వాళ్లు కూడా సంతృప్తి చెందారు. 

ఆ గౌరవాన్ని గుర్తుచేసేలా..

ఈ ఫాస్ట్ జనరేషన్‌‌‌‌లో పేరెంట్స్‌‌‌‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను పిల్లలు ఇవ్వడం లేదేమో అనిపిస్తోంది.  ముఖ్యంగా తల్లి కొడుకు మధ్య బాండింగ్‌‌‌‌ తగ్గుతోంది.  తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను, గౌరవాన్ని గుర్తుచేసేలా మేకర్స్‌‌‌‌ ఈ కథను తీర్చిదిద్దారు.  ఫ్యామిలీ ఆడియన్స్‌‌‌‌, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు చాలా బాగుందని చెబుతున్నారు. 

ప్రతిరోజు జిమ్

ఒకప్పుడు ఎన్నో యాక్షన్‌‌‌‌ మూవీస్‌‌‌‌ చేశా. తిరిగి ఇప్పుడు యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌లో నటించడం కొంత కష్టమే అయినప్పటికీ నటించాను. ఏడాదిపాటు ఈ సినిమా కోసం ఫిజిక్‌‌‌‌ మెయింటెన్‌‌‌‌ చేయాల్సి వచ్చింది. ప్రతిరోజు డైట్, ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ కంపల్సరీగా ఫాలో అయ్యాను. ఒక్కోసారి ఇంట్లో కుదరకపోతే షూటింగ్‌‌‌‌లోనూ జిమ్ చేసేదాన్ని. బాడీని ఎక్కడా ప్రశాంతంగా ఉంచలేదు. 

నా దారి రహదారి

ఇప్పటి దర్శకులు కూడా నన్ను దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తున్నారంటే  అందుకు కారణం ఒకప్పటి నా కెరీర్‌‌‌‌‌‌‌‌. నా దారి రహదారి అనే డైలాగ్‌‌‌‌ తరహాలో కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం నుంచి నా రూటే సపరేట్‌‌‌‌. హీరోలకు విగ్‌‌‌‌లు, మీసాలు పెట్టి గెటప్‌‌‌‌ మార్చేవారు.  కానీ నా విషయంలో అలా కాదుగా..  జడ, పోనీ టెయిల్‌‌‌‌ లేదంటే లూజ్‌‌‌‌ హెయిర్. కేవలం ఫేస్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెషన్స్‌‌‌‌తోనే ఒక్కో సినిమాలో ఒక్కోలా వైవిధ్యం చూపించి మెప్పించగలిగాను. దాన్ని గాడ్ గిఫ్ట్‌‌‌‌గా భావిస్తాను.    

60 మంది హీరోలతో..

ఓ వైపు స్టార్ హీరోలతో గ్లామర్ పాత్రలు చేసేదాన్ని. మరోవైపు కొత్త హీరోలతో చిన్న సినిమాలు చేశా. నేను 60కి పైగా హీరోలతో కలిసి పనిచేశా. ఇవన్నీ చేస్తూనే యాక్షన్ సినిమాలు చేశాను. ఒక సినిమాకు మరో సినిమాకు పోలిక లేకుండా డిఫరెంట్ సినిమాలు చేశా. ఆ విషయంలో నేను లక్కీ. 

ఫస్ట్ లేడీ సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌గా..

ఒకప్పుడు రోజుకు 6 షిప్టులు చొప్పున సంవత్సారానికి 17 సినిమాలు చేశాను. ‘ప్రతిఘటన’చిత్రానికి డేట్స్‌‌‌‌ సర్దుబాటు చేయలేక మరో హీరోయిన్‌‌‌‌తో చేసుకోమని చెప్పా. కానీ చివరికి నా దగ్గరకే వచ్చింది.  అది నాకు రాసిపెట్టుంది. ఆ సినిమా ఘనవిజయంతో జనం నాకు ‘లేడీ సూపర్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌’ట్యాగ్‌‌‌‌ను ఇచ్చారు.  దాన్ని ఫస్ట్ టైమ్‌‌‌‌ వాడింది నాకే. ఇక ‘కర్యవ్యం’తో యాక్షన్‌‌‌‌ క్వీన్‌‌‌‌ అన్నారు. ఆ తర్వాత లేడీ అమితాబ్, లేడీ జాకీచాన్‌‌‌‌ లాంటి చాలా బిరుదులు ఇచ్చారు.  అందుకు తగ్గట్టుగా క్రమశిక్షణ, డెడికేషన్‌‌‌‌తో హార్డ్ వర్క్‌‌‌‌  చేశాను. 

చిరు, బాలయ్యలతో..

చిరంజీవి గారి సినిమాలోనో లేక బాలకృష్ణ గారి సినిమాలోనో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలు ప్రచారం మాత్రమే.  నాపై ఉన్న ప్రేమ వల్ల అభిమానులు అలా ప్రచారం చేస్తుంటారు. ఇక ‘అఖండ 2’లో నేను నటిస్తున్నాననేది మీరు చెబితేనే నాకు తెలిసింది.. అవన్నీ ప్రచారాలే. 

పోలీస్ అంటే విజయశాంతి

రామారావు (ఎన్టీఆర్‌) గారిని దృష్టిలో ఉంచుకుని కృష్ణుడి కథ రాస్తే.. మరొకరిని ఆ పాత్రకు ఊహించుకోలేం. అలాగే పోలీస్‌‌‌‌ అంటే విజయశాంతి.. మరొకరిని ఊహించుకోలేరు. ఈ సినిమా విషయంలో కూడా మేకర్స్‌‌‌‌ ఫిక్స్ అయ్యారు. గత జన్మ పుణ్యం కావొచ్చు.. జనం మమ్మల్ని దీవించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్‌ తనకంటే చిన్నవాళ్లైనా సరే,  ‘మీరు..’అని సంబోధించేవారు. అందరితో గౌరవంగా మెలగడం ఆయన్ని చూసి నేర్చుకున్నా.

కథ దొరకడమే గగనం 

హీరోలకే ఏడాదికో, రెండేళ్లకో ఓ కథ దొరుకుతుంది. మా టైమ్‌‌‌‌లో ఎక్కువ కథలు వచ్చేవి. జయాపజయాలు పట్టించుకోకుండా చేసుకుంటూ వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు ఓ కథ దొరకడమే గగనం అవుతోంది. నేను ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ రోల్ చేయగలిగే కథ ఉంటే చేయడానికి రెడీగా ఉన్నా. అలాంటి కథ వస్తే తప్పకుండా చేయొచ్చు. 

గతజన్మలో కొడుకేమో!

చాలామంది ఆర్టిస్టులతో కలిసి  ఎన్నో సినిమాలు చేశాను. షూటింగ్ పూర్తయ్యాక నాపాటికి నేను వెళ్లిపోతాను. ఎందుకో తెలియదు కానీ ఈ సినిమా విషయంలో.. కళ్యాణ్ బాబుకి, నాకు మధ్య  మదర్ అండ్ సన్ బాండింగ్ ఏర్పడింది.  మాకు తెలియకుండానే ఒకరిపై మరొకరికి ఆప్యాయత కలిగింది. బహుశా.. పోయిన జన్మలో కళ్యాణ్ రామ్ నాకు కొడుకేమో!

హీరోయిన్స్‌‌‌‌కు రెండే సీన్స్‌‌‌‌

ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా వాళ్లకు ఇచ్చిన పాత్రకు తగ్గట్టు బాగా చేస్తున్నారు. అయినా వాళ్లకు ఇచ్చేదే తక్కువ పాత్ర.  రెండు పాటలు, రెండు సీన్స్ ఇస్తున్నారు.. వాళ్లు మాత్రం ఏం చేయగలుగుతారు. ఫుల్‌‌‌‌ లెంగ్త్ రోల్ ఇస్తే ఎలా చేశారనేది అర్థమవుతుంది. 

స్ఫూర్తినిచ్చే పాత్రలు..

నేను పొలిటికల్ మీటింగ్స్‌‌‌‌కు వెళ్లినప్పుడు ఈ జనరేషన్‌‌‌‌ వాళ్లు కూడా నా సినిమాలు చూశానని మాట్లాడుతుండటం చూసి ఆశ్చర్యమేస్తుంది. నేను పోషించిన పాత్రల్లోని డేరింగ్‌‌‌‌ అండ్ డాషింగ్‌‌‌‌ నేచర్‌‌‌‌‌‌‌‌ను స్ఫూర్తిగా తీసుకుంటామని మహిళలు చెబుతుంటారు.  ఆడపిల్లలు అలా ధైర్యంగా ఉండాలని, చిన్న చిన్న విషయాలకు సూసైడ్స్‌‌‌‌ చేసుకోవడంసరికాదని చెబుతుంటాను.  

ఈ సినిమా ఇండస్ట్రీనే నన్ను సూపర్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ను చేసింది. అలాంటి ఇండస్ట్రీ బాగుండాలనే ఇటీవల సక్సెస్‌‌‌‌మీట్‌‌‌‌లో కామెంట్స్ చేశాను. కొన్ని జరుగుతున్నవి, చూస్తున్నవి, వింటున్నవి ఆరోజు వేదికపై ప్రస్తావించాను. అది ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదు.. మన చుట్టూ జరుగుతున్న వాస్తవం అది. ఒక ఇండస్ట్రీ బతకాలి, చావకూడదు.. ఎందుకంటే ఇదొక మహావృక్షం. చాలామంది దీని నీడన బతుకుతున్నారు.  ఒక కూరగాయను నాలుగైదు రకాలుగా వండగలం. లక్ష రకాలు చేయలేం కదా. సినిమా కూడా అంతే. బాగున్న సినిమాలను విమర్శించడం కరెక్ట్ కాదు.