ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి : పి.రాంబాబు

ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి  :  పి.రాంబాబు
  • అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు 

సూర్యాపేట, వెలుగు: కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం సూర్యాపేట మండలంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకోనిరావాలని సూచించారు. తేమ శాతం 17రాగానే సీరియల్ ప్రకారం కాంటా వేసి మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

 అనంతరం ఇమాంపేట మోడల్ పాఠశాలను ఆయన సందర్శించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట సెంటర్ ఇన్​చార్జిలు పద్మ, నాగమణి ఉన్నారు.