రోడ్డు ప్రమాదంలో అడిషనల్​ ఎస్పీ మృతి

రోడ్డు ప్రమాదంలో అడిషనల్​ ఎస్పీ మృతి
  • రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో ఘటన

ఎల్బీనగర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో ఉండే అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ (50) శనివారం ఉదయం వాకింగ్ కు వెళ్లాడు.

 నేషనల్​హైవేపై ఉన్న హనుమాన్ దేవాలయం సమీపంలో రోడ్డు దాటుతుండగా..నూజివీడు(ఏపీ) డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంగా దూసుకొచ్చి నందీశ్వర బాబ్జీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఆర్టీసీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా హయత్ నగర్ సీఐ వెల్లడించారు.