
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూభారతి చట్టంపై ఈ నెల 30 వరకు అవగాహన కార్యక్రమాలు ఉండడంతో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.