
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జిల్లాలో బెట్టింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్మహాజన్హెచ్చరించారు. ఆదివారం పోలీస్‌కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని రాంనగర్లో బెట్టింగ్ కు పాల్పడుతున్న షేక్ రియాజ్, మహారాష్ట్ర కిన్వట్‌కు చెందిన ఆరిఫ్, లడ్డూ చౌహాన్, పిట్టలవాడకు చెందిన గంథాడే సోహన్, భుక్తాపూర్ ఖిల్లా ఏరియాకు చెందిన సుల్తాన్ పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
బెట్టింగ్ కు అలవాటుపడి యువత ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దన్నారు. మోసగాళ్ల మోసపూరిత ప్రకటనలు చూసి ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడడం, గుర్తింపు లేని ఇంటర్నెట్సంస్థల్లో డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహించే వారిపై పోలీసుల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.