అదితి అదరహో.. ఆర్చరీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణం

  • అతి చిన్న వయసులో వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా రికార్డు
  • జ్యోతికి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌, ఓజాస్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌

బెర్లిన్‌‌‌‌‌‌‌‌: ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ ఆర్చర్‌‌‌‌‌‌‌‌ అదితి స్వామి.. వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఆరోసీడ్‌‌‌‌‌‌‌‌ అదితి 149–147తో 16వ సీడ్‌‌‌‌‌‌‌‌ అండ్రియా బెకెరా (మెక్సికో)పై గెలిచి స్వర్ణం గెలిచింది. దీంతో 17 ఏళ్ల అతి చిన్న వయసులో సీనియర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కింది. రెండు నెలల కిందట జూనియర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన అదితి అదే ఫామ్‌‌‌‌‌‌‌‌ను ఇప్పుడు బెర్లిన్‌‌‌‌‌‌‌‌ టోర్నీలోనూ కొనసాగించింది.  స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే అద్భుతమైన గురితో ఆకట్టుకున్న ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఆర్చర్​ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో 30–29తో ఆధిక్యంలో నిలిచింది. తొలి నాలుగు రౌండ్లలో 12 బాణాలు వేసిన అదితి మూడు పాయింట్ల లీడ్‌‌‌‌‌‌‌‌ను సంపాదించింది. లాస్ట్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో మూడు బాణాలతో 9 పాయింట్లు నెగ్గిన అదితి వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో రెండో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.

 ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుత చాంపియన్‌‌‌‌‌‌‌‌ సారా లోపెజ్‌‌‌‌‌‌‌‌ను ఓడించిన బెకెరా టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌ మాత్రం నిరాశపర్చింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం 145–149తో అదితి చేతిలో ఓడింది. అయితే థర్డ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ వర్గీకరణ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జ్యోతి 150–146తో ఇపెక్‌‌‌‌‌‌‌‌ టొమ్రోక్‌‌‌‌‌‌‌‌ (టర్కీ)పై నెగ్గి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా జ్యోతి ఖాతాలో ఒక గోల్డ్‌‌‌‌‌‌‌‌, 4 సిల్వర్‌‌‌‌‌‌‌‌, 3 బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. మెన్స్‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో ఓజాస్‌‌‌‌‌‌‌‌ డియోటలే 150–149తో లుకాస్జ్ ప్రజిబిల్కీ (పోలెండ్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి గోల్డ్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకున్నాడు. దీంతో వరల్డ్​ చాంపియన్​షిప్​లో స్వర్ణం నెగ్గిన తొలి పురుష ఆర్చర్​గా రికార్డు సృష్టించాడు.