న్యూఢిల్లీ: ప్రమోటర్లు, క్వాలిఫైడ్ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్) ద్వారా రూ.4,789 కోట్లు సేకరిస్తామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్(ఏబీఎఫ్ఆర్ఎల్) ప్రకటించింది. వీటిలో ఇది వరకే రూ.2,378.75 కోట్లు సేకరించింది. రూ.10 ముఖ విలువ గల 4.08 కోట్ల షేర్లను రూ.317.45 చొప్పున ప్రమోటర్ గ్రూప్ పిలానీ ఇన్వెస్ట్మెంట్కు జారీ చేయడానికి ఏబీఎఫ్ఆర్ఎల్ బోర్డు అంగీకరించింది. దీంతో రూ.1,297 కోట్లు వచ్చాయి. నాన్–ప్రమోటర్ కేటగిరీలో క్యాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ నుంచి రూ.10,811.25 కోట్లను సమీకరించింది. ఇందుకోసం రూ.10 ముఖ విలువ గల షేర్లను రూ.272.37 ధరతో జారీ చేసింది.